చందోలు(కర్లపాలెం): చందోలు జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని కారు ఢీకొనటంతో ఆ వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతిచెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. చందోలు ఏఎస్‌ఐ రామయ్య తెలిపిన వివరాల మేరకు... చందోలు ఎస్టీ కాలనీకి చెందిన నంబూరు నాంచారయ్య(35) చందోలు ఐస్ ఫ్యాక్టరీ సమీపంలోని 216 జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళుతుండగా చెరుకుపల్లి వైపు నుంచి చీరాల వైపు వస్తున్న కారు ఢీ కొనటంతో నాంచారయ్య తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. నాంచారయ్యకు భార్య ఉంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎఎస్‌ఐ తెలిపారు.


