
నిలబడేందుకు కూడా ఇబ్బందే..
బస్సుల సంఖ్య పెంచకపోవడంతో మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అన్ని బస్సులకు ఉచితం అమలు చేయకపోవడంతో వచ్చే ఒకటీ, రెండు బస్సుల కోసం తీవ్రంగా ఎదురుచూడాల్సి వస్తోంది. సీట్లు దొరక్కపోగా నిలబడేందుకు చూడా చోటు లేకుండా మారింది.
– వేముల గురవమ్మ, పిడుగురాళ్ల
మా గ్రామానికి బస్సు లేదు
మా పల్లెకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. అలాంటప్పుడు ప్రభుత్వం ఉచిత బస్సు పథకం అమలు చేసినా మాకు పెద్దగా ఉపయోగం లేదు. దీంతో ఆటోలలో ప్రయాణం చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా మా గ్రామ విద్యార్థులు కాలినడక, ఆటోలలో బడులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే మా గ్రామానికి ఆర్టీసీ బస్సులను తిప్పాలి. అప్పుడే మేం పూర్తిగా ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకోగలం.
– బుదాటి మరియమ్మ, నందిరాజుపాలెం, బెల్లంకొండ మండలం

నిలబడేందుకు కూడా ఇబ్బందే..

నిలబడేందుకు కూడా ఇబ్బందే..