
గుంటూరు చానల్‌కు మరమ్మతులు
కృష్ణా నది నుంచి నీటి సరఫరానునిలిపివేసిన యంత్రాంగం తాగునీటి కోసం ప్రత్యామ్నాయాలపై స్థానిక అధికారుల దృష్టి
మంగళగిరి: గుంటూరు చానల్‌కు కాజ వద్ద జరుగుతున్న మరమ్మతుల కారణంగా కృష్ణా నది నుంచి నీటిని ఆపారు. ఈ నేపథ్యంలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజారోగ్య శాఖ జేఈ ప్రసన్న తెలిపారు. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థకు తాగునీరు సరఫరా చేసే మంగళగిరి మండలంలోని ఆత్మకూరు వద్ద కల గుంటూరు చానల్‌ను, తాగునీటి పథకాన్ని జేఈ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుంటూరు చానల్ మరమ్మతుల కారణంగా మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థతో పాటు గుంటూరు నగరం, మరికొన్ని ప్రాంతాలకు తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వెల్‌లోని నీటిని వాడుకోవడంతోపాటు సీతానగరం నుంచి గుంటూరు వెళ్లే పైపులైన్ల నుంచి ఎంటీఎంసీకి నీటిని తీసుకుని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గుంటూరు చానల్‌కు మరమ్మతులు దాదాపు పూర్తి కావచ్చినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారని వివరించారు. ఆ పనులు పూర్తయిన వెంటనే చానల్‌కు నీరు సరఫరా అవుతుందని తెలిపారు.
ఐదు మండలాలకు ఇదే కీలకం
గుంటూరు, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ఐదు మండలాలకు సాగు, తాగునీటిని గుంటూరు చానల్ ద్వారా అందిస్తున్నారు. కృష్ణా నది వద్ద ప్రకాశం బ్యారేజీ నుంచి 47 కిలోమీటర్ల పొడవున ప్రవహించి సాగు, తాగునీటి అవసరాలను ఈ చానల్ తీరుస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, పెదకాకాని, గుంటూరు కార్పొరేషన్, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు మండలాల ప్రజలు తద్వారా లబ్ధి పొందుతున్నారు. మొత్తం 600 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తుండగా.. వరి, మిరప, పత్తి, అపరాల పంటలు సాగు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 4 టీఎంసీలు సరఫరా అవుతుండగా.. 3.2 టీఎంసీలు సాగుకు, 1.42 టీఎంసీలను తాగునీటికి వినియోగిస్తున్నారు. ఐదు మండలాల్లోని గ్రామాలలోని ట్యాంకులకు ఈ తాగునీరు అందుతోంది. ఇటీవల వర్షాలకుతోడు కొండవీటివాగు వరదను ఈ చానల్‌లోకి మళ్లించడంతో గండ్లు పడి వేలాది ఎకరాలోపంట నీటమునిగింది. మరోవైపు గుంటూరు చానల్‌పై కాజ – నంబూరు మధ్య వంతెన సహా పలు చోట్ల ఉన్నవి శిథిలావస్థకు చేరాయి. ఇప్పటికే అంతంత మాత్రంగా సరఫరా అవుతున్న నీరు ఈ వంతెన వద్ద ఏ చిన్న ఘటన జరిగినా పెద్దసంఖ్యలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు.