
అంగన్‌వాడీల డిమాండ్లు పరిష్కరించాలి
తెనాలి టౌన్: అంగన్‌వాడీ కార్యకర్తల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గురువారం స్థానిక సీడీపీవో కార్యాలయం ఎదుట ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏవీఎన్ కుమారి మాట్లాడుతూ ఈకేవైసీ, ఫేస్ రికగ్నేజేషన్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన వలన లబ్ధిదారులకు సకాలంలో ఫీడింగ్ ఇవ్వలేకపోతున్నట్లు ఆరోపించారు. 10 ఏళ్ల క్రితం ఇచ్చిన స్మార్ట్ ఫోన్ల వలన నెట్‌వర్క్ సరిగా పనిచేయక లబ్ధిదారులు ఒకటికి మూడు సార్లు అంగన్‌వాడీ కేంద్రాలకు రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారులు తమపై అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో లబ్ధిదారులకు ఫీడింగ్ ఇవ్వడం కష్టంగా ఉందన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం సీడీపీవో విజయగౌరికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు షేక్ హుస్సేన్ వలి, కె.రంగపుష్ప, రాధిక, రాజకుమారి, రామలక్ష్మి, రాహెలమ్మ, ఎస్‌కే ముని, వహీదా, సీహెచ్ శివకుమారి, కె.మాధవి, డి.కళ్యాణి, ఎం.సుజాత, వై.నాగమల్లేశ్వరి, కె.లక్ష్మి , బుల్లెమ్మ, ఎలిజిబెత్ రాణి, రమాదేవి, త్రివేణి, అలిషా బేగం, జ్యోతి, సునీత, రజియా తదితరులు ఉన్నారు.