
బాలికల వాలీబాల్ పోటీల విజేత వాల్తేరు
సత్తెనపల్లి: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ హైదరాబాద్ 54వ రీజియన్ స్థాయి అండర్–17 బాలికల వాలీబాల్ పోటీల్లో వాల్తేరు జట్టు విజేతగా నిలిచింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని (రామకృష్ణాపురం) పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఆవరణలో రెండు రోజులుగా జరుగుతున్న పోటీలు శుక్రవారంతో ముగిశాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 8 జట్లు పాల్గొన్నాయి. వాల్తేరు, సత్తెనపల్లి, ఖమ్మం జట్లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. అపూర్వ వైద్యశాల అధినేత డాక్టర్ పాలేటి నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఓటమితో కుంగిపోకుండా సాధన చేసి మరింతగా రాణించాలన్నారు. విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రదానం చేసి అభినందించారు. రిటైర్డ్ పీడీ ఐఎస్ నాగిరెడ్డి, పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ సత్తెనపల్లి ఇన్చార్జ్ ప్రిన్సిపల్ బి.కిరణ్ రెడ్డి, రిఫరీలు తదితరులు పాల్గొన్నారు. శనివారం నుంచి 17 బాలుర జట్లు రెండు రోజులపాటు తలపడనున్నాయి.
రెండో స్థానంలో నిలిచిన
సత్తెనపల్లి జట్టు

బాలికల వాలీబాల్ పోటీల విజేత వాల్తేరు