
నాగుల చవితి సంబరాలు అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు నాగేంద్రుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. పుట్టల వద్ద గంటల తరబడి బారులుతీరి పాలుపోసి ప్రత్యేక పూజలు చేశారు. విన్నపాలు మొరపెట్టారు. అమరావతి బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలోని నాగేంద్రునికి పుట్ట వద్ద భక్తులు అధికసంఖ్యలో పాలుపోశారు. తొలుత కృష్ణానదిలో కార్తీక పుణ్యస్నానాలు ఆచరించారు. ఉసిరిక చెట్టు వద్ద దీపాలు వెలిగించారు. అనంతరం అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరికి కుంకుమపూజలు చేశారు. – అమరావతి
