ప్రొఫెసర్‌ జీఎస్‌ఎన్‌ రాజుకు జాతీయ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ జీఎస్‌ఎన్‌ రాజుకు జాతీయ పురస్కారం

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

పర్లాకిమిడి: సెంచూరియన్‌ విశ్వవిద్యాలయంలో చాన్సలర్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.ఎస్‌.ఎన్‌.రాజు.. కోల్‌కోత్తాలో శనివారం ఐఐటియన్‌ సెంట్రల్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ బోర్డు చైర్మన్‌, ప్రసారభారతి మాజీ సీ.ఈ.ఓ. పద్మశ్రీ వెంపటి శేషుశేఖర్‌ చేతుల మీదుగా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. సెంచూరియన్‌ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్‌.రావు శుభాకాంక్షలు తెలిపారు. జి.ఎస్‌.ఎన్‌.రాజు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైస్‌ చాన్సలర్‌గా పనిచేసిన సమయంలో ఆయన సేవలకు గుర్తించి కల్నల్‌ అనే బిరుదుతో సత్కరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో ఆయన విశేషంగా కృషి చేశారు. ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌పై రాసిన 531 థీసిస్‌ పేపర్లు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురణకు నోచుకున్నాయి. స్వచ్ఛ విశాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేశారు. 2007లో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ బెస్ట్‌ అకాడమిషియన్‌ ఆవార్డు అందుకోవడమే కాకుండా డి.ఆర్‌.డి.ఓకు చెందిన పలు ప్రాజెక్టులకు ఆయన వంతు సహకారం అందజేశారు. సెంచూరియన్‌ వర్సిటీలో జి.ఎస్‌.ఎన్‌.రాజు వైస్‌ చాన్సలర్‌గా ఆరేళ్లు పనిచేసి వర్సిటీ అభ్యున్నతికి కృషి చేశారు. ప్రస్తుతం ఆయన విశాఖలో శ్రీనివాసా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, టెక్నాలజీ కళాశాలకు సి.ఈ.ఓగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement