రాయగడ:
ఆరోగ్యంపై అవగాహన, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు పూరీలో జరగనున్న ఓఎంసి కోస్టల్ మారధాన్‌లో రాయగడ జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సాహించేందుకు నిర్వహించిన రమో రన్‌కు విశేష స్పందన లభించింది. ఆదివారం ఉదయం జరిగిన 5 కిలో మీటర్ల పరుగులో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, క్రీడాభిమానులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ రవీంద్ర కుమార్ కహర్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమైన పరుగును గజపతి కూడలి, ఓవర్ బ్రిడ్జి, కొరాపుట్ కూడలి మీదుగా అంబాగుడలోని ఇండోర్ స్టేడియం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన మారథాన్‌లో పురుషుల విభాగంలో శ్రీకాంత్ ప్రస్కా మొదటి స్థానం, ఆర్.ధోని రెండో స్థానం, శంకర్ ప్రస్తా మూడో స్థానంలో నిలిచారు. అదేవిధంగా మహిళల విభాగంలో దేవస్మిత గరడియా ప్రథమం, మనప్రభ కుట్రుక ద్వితీయ, సోనియా నాయక్ తృతీయ స్థానాలను సంపాదించుకున్నారు. డిసంబర్ 13న పూరీలో ఓఎంసి పూరీ కోస్టల్ మారథాన్–2026 జరగనున్న ప్రమో రన్‌లో విజేతలు పాల్గొంటారు.


