నిమజ్జనోత్సవంలో విషాదం | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనోత్సవంలో విషాదం

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

భువనేశ్వర్‌: ఖుర్దా జిల్లా జట్నీలో గణపతి విగ్రహాల నిమజ్జన ఊరేగింపులో విషాదం చోటు చేసుకుంది. ఒక కాంక్రీట్‌ నిర్మాణం కూలి ఊరేగింపులో కిక్కిరిసి ఉన్న జనాలపై పడటంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో 10 మందికి పైగా గాయపడ్డారు. వారందర్ని తొలుత సమీపంలోని ఆస్పత్రికి, ఆ తర్వాత భువనేశ్వర్‌కు తరలించారు. గాయపడిన వారిలో 4 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందడంతో భువనేశ్వర్‌ డీసీపీ మరియు అదనపు పోలీస్‌ కమిషనర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి కారణం స్పష్టం కాకున్నా ఊరేగింపు సమయంలో దద్దరిల్లిన డీజే ధ్వనితో అప్పటికే తెరిపి లేని కుండపోత వానల్లో నాని ఉన్న డాబా పిట్ట గోడ కూలిందని భావిస్తున్నారు. స్థానిక పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు శాఖ కార్యాలయం గోడ విరిగి పడడంతో ఈ ప్రమాదం సంభవించింది.

నూతన కార్యవర్గ ఎన్నిక

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): మాల గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జంగం విజయానంద్‌ తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం ఇలిసిపురంలోని అంబేడ్కర్‌ విజ్ఞాన మందిర్‌లో సంఘ జనరల్‌ బాడీ సమావేశం, నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడిగా బడియా కామరాజు, అధ్యక్షులుగా కె.ప్రవళ్లిక ప్రియ, అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఎల్‌.అప్పన్న, ఉపాధ్యక్షులుగా కె.రాము, బి.వి.వి.ఎస్‌.దొర, ప్రధాన కార్యదర్శిగా జి.నాగరాజు, జాయింట్‌ కార్యదర్శి కె.పున్నయ్య, మహిళా కార్యదర్శి బోనెల లావణ్య, కోశాధికారి కె.నారాయణరావు, ఈ.సి.మెంబర్లుగా వై.వనప్రసాద్‌, శివాజీ హరీష్‌, రెయ్య రమణ, గోగరాజులను నియమించారు. కార్యక్రమంలో పోలకటి రామకృష్ణ (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), వెంకటేశ్వరరావు (రాష్ట్ర కోశాధికారి), నగిరి కాళిదాసులు, రాష్ట్ర ఎన్‌జీజీవో వైస్‌ ప్రెసిడెంట్‌ రాయి వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

సిక్కోలు కవులకు గురజాడ పురస్కారాలు

శ్రీకాకుళం కల్చరల్‌ : రాజమహేంద్రవరంలోని గ్లోబల్‌ యూనివర్సిటీలో చైతన్య సారస్వత పరిషత్‌, హైదరాబాద్‌కు చెందిన తెలుగు భాషా చైతన్య సమితి, కుసుమ ధర్మాన పీఠం ఆధ్వర్యంలో మహాకవి గురజాడ అప్పారావు జయంతోత్సవాల సందర్భంగా జాతీయ తెలు గు శతకవి సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కోలు నుంచి 16 మంది కవులకు గురజాడ పురస్కారాలు ప్రదా నం చేశారు. కవులు భోగెల ఉమామహేశ్వరరావు, రుష్యశృంగుని ఢిల్లేశ్వరరావు, ఇద్ధి పాప య్య, ఎం.లింగరాజు, ఐఎన్‌డీ ప్రసాద్‌, వాడా డ శ్రీనివాసరావు, తాళ్లూరి విజయ లక్ష్మణ్‌, కిల్లన శ్రీనివాస్‌, శాంతారావు, కుప్పుని వెంకట రాజారావు, పల్లె తేజేశ్వరి, గణస్వామి తదితరులు పురస్కారాలు అందుకున్నారు. గురజాడ సాహిత్యంపై కవితలు చదివి వినిపించారు.

జ్ఞానేశ్‌కుమార్‌

రాజీనామా చేయాలి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోనారి మోహన్‌రావు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం నగరంలోని క్రాంతి భవన్‌లో ఆదివారం వామపక్షాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసీఐ స్వతంత్ర సంస్థగా కాకుండా బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. జ్ఞానేష్‌ కుమార్‌ పదవిలో కొనసాగే హక్కును కోల్పోయారని చెప్పారు. ఈ నెల 28న షహీద్‌–ఎ–ఆజం భగత్‌ సింగ్‌ జయంతిని పాటిస్తూ మహాత్మా గాంధీ జయంతితో ముగిసేలా, సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 2 వరకు వారం రోజుల పాటు నిరసనలు చేపట్ట నున్నట్లు తెలిపారు. సమావేశంలో వామపక్ష నాయకులు కె.మోహన్‌రావు, ఎస్‌.కృష్ణవేణి పాల్గొన్నారు.

2న జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జూనియర్స్‌ బాలబాలికల ఖోఖో జట్ల ఎంపికలు అక్టోబర్‌ 2న జరగనున్నాయని జిల్లా ఖోఖో అసోసియేషన్‌ అధ్యక్షుడు చిట్టి నాగభూషణం, కార్యదర్శి సీహెచ్‌ ఫల్గుణరావు ఆదివారం తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని పీఎస్‌ఎన్‌ఎం హైస్కూ ల్‌ వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఎంపికల ప్రక్రియ మొదలువుతుందని పేర్కొన్నారు. 2008 డిసెంబర్‌ ఒకటో తేదీ తర్వాత జన్మించిన బాలబాలికలు అర్హులని స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement