జయపురం: కొరాపుట్ జిల్లా పొరజా సమాజ్ 23వ వార్శికోత్సవం జయపురంలో అంగరంగ వైభవంగా సమిది కోత్సాహంతో పొరాజా సంప్రదాయ ప్రజలు శనివారం సాయంత్రం నిర్వహించారు. జయపురం సమితి హోరడాపుట్ కూడలి వద్ద గల జిల్లా పరజా సమాజ్ వ్యవస్థాపకుడు స్వర్గీయ డొంబురు నాయక్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఇతర వ్యవస్థాపక సభ్యులు స్వర్గీయ సోను మఝి, దివంగత భూపేన్ జానీ, దివంగత టంకుదొర జానీ, దివంగత సోనియ జానీ సేవలను స్మరించుకున్నారు. జిల్లా పొరజ సమాజ్ అధ్యక్షులు కమల జానీ నేతృత్వంలో శోభాయాత్ర నిర్వహించారు. హోరడాపుట్‌లో ప్రారంభమైన శోభాజాతర కుమిలిపుట్ వరకు సాగింది. శోభాజాతరలో పొరజ ఆదివాసీ ప్రజలు సంప్రదాయ నృత్యం, నాట్యాలతో పాల్గొన్నారు. కుములిపుట్ గ్రామం వద్ద సమాజ్ నిర్వహించిన వ్యవస్థాపక సభలో సమాజ్ కన్వీనర్ త్రినాథ్ ముదులి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జయపురం డైట్ ప్రిన్సిపాల్ మమతా ఝొడియ పాల్గొన్నారు. ముఖ్యవక్తగా రాయగడ మాజీ ఎమ్మెల్యే మకరంధ ముదులి పాల్గొని పొరజా సంప్రదాయ ప్రజల ఆర్థిక, సామాజిక ఉన్నతికి సమాజ్ కృషి చేయాలన్నారు. గౌరవ అతిథులుగా సీనియర్ న్యాయవాది, జిల్లా పొరజా సమాజ్ మాజీ అధ్యక్షుడు హరీష్ చంద్ర ముదులి, కొరాపుట్ నుంచి మదన్ కిరసాని, పద్మనాభ జానీ, సనా జానీ, మల్కనగిరి జిల్లా ప్రతినిధులు డాక్టర్ ఉదయనాథ్ ఖొర, బొరిగుమ్మ నుంచి శ్రీకాంత జానీ, విశాల్ జానీ, పీతావబర మఝి, పొట్టంగికి చెందిన సునీల్ పెదకాపు, నందపూర్‌కు చెందిన భగవాన్ పెంటియ, శివ ముదులి, గోవింద ఖొరా, నవరంగపూర్ నుంచి బుధు జానీ, భగవాన్ జానీ, మనీషా ముదులి, తొబా నాయక్, కొట్‌పాడ నుంచి జగబందు ముదులి, బొయిపరిగుడ నుంచి లయిచెన్ మఝి, జయపురం మున్సిపాలిటీ ఉద్యోగి నారాయణ జానీ తదితరులు పాల్గొన్నారు.


