శనివారం శ్రీ 26 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 26 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 26 2026 1:32 AM | Updated on Sep 26 2026 1:32 AM

న్యూస్‌రీల్‌

యోగాతో మానసిక ప్రశాంతత

రాయగడ: యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని వక్తలు పేర్కొన్నారు. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత, శారీరక దృఢత్వంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో స్థానిక రాయగడ స్వయంపాలిత కళాశాలలో యోగా, ధ్యాన శిబిరం శుక్రవారం నిర్వహించారు. సేవా సంకల్ప్‌ అభియాన్‌–2026లో భాగంగా కళాశాల గోల్డెన్‌ జూబ్లీ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సరస్వతి రాయ్‌ మార్గదర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒత్తిళ్లు అధిగమించేందుకు యోగా చక్కగా ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమాన్ని డాక్టర్‌ లిజారాణి శతపతి, లెప్టెనెంట్‌ ఉదయ్‌ నాయక్‌ సమన్వయం చేశారు.

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ

రాయగడ: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని వక్తలు అన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు తల్లిపై ప్రేమాభిమానాలకు ప్రతీకగా జిల్లా పరిషత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా రాయగడ సమితి హలువ గ్రామ పంచాయితీలో ఉన్న ఉపర్‌ శంకేష్‌ సమీప పర్యాటక ప్రాంతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తమ తల్లుల పేరుతో మొక్కలు నాటారు. కర్యాక్రమంలో కలెక్టర్‌ అశుతోస్‌ కులకర్ణి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ సరస్వతి మాఝి, జిల్లా పరిషత్‌ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్‌ ఖెముండొ, సబ్‌ కలెక్టర్‌ మృణాళిని రాథోడ్‌, డీఎఫ్‌వో అన్నా సాహెబ్‌ ఆహలే తదితరులు పాల్గొన్నారు.

సమస్యలపై వినతిపత్రం అందజేత

జయపురం: పెరుగుతున్న ధరలు, జయపురం ప్రజల సమస్యలపై సోషలిస్ట్‌ యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా(కమ్యూనిస్టు పార్టీ) జయపురం యూనిట్‌ స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఒక మెమోరాండం సమర్పించింది. అదుపు లేకుండా పెరుగుతున్న ధరలను నియంత్రించాలని, ప్రజల మౌలిక సౌకర్యాలపై ఆ పార్టీ ప్రాంతీయ కార్యదర్శి ప్రద్యుమ్న సామంతరాయ్‌ నేతృత్వంలో మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారికి వినతిపత్రం అందజేశారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బందిని నియమించాలని కోరారు. పట్టణ ప్రధాన మార్గాలలో విచ్చలవిడిగా సంచరిస్తున్న పశువులు, కుక్కలను అరికట్టాలన్నారు. వినతిప్రతం సమ ర్పించిన వారిలో ఎస్‌యూసీఐ కమ్యూనిస్టు పార్టీ జిల్లా ఆర్గనైజర్‌ సుభాష్‌ భట్టాచార్య, ఇందుమతి దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

చోరీ కేసులో నిందితుడికి జైలుశిక్ష

రాయగడ: చోరీ కేసును ఝార్సుగుడ పోలీసులు వేగంగా దర్యాప్తు పూర్తిచేసి కేవలం 17 రోజుల్లోనే నిందితుడికి న్యాయస్థానం ద్వారా జైలుశిక్ష పడేలా చేశారు. జిల్లాలోని రెంగాలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ కేసు నమోదయ్యింది. కటార్బగా పాఠశాల సమీపంలో ఉన్న సీఎస్‌సీ కేంద్రంలో ఈనెల 9వ తేదీ రాత్రి చోరీ జరిగింది. కేంద్రం నుంచి నాలుగు సెకెండ్‌ హ్యాండ్‌ సెల్‌ఫోన్లు, రెండు ఇయర్‌ బడ్స్‌ దొంగతనానికి గురయ్యాయి. ఈ కేసును రెంగాలి పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ సమరేంద్ర నాయక్‌ దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా దేహెరిగుడ గ్రామానికి చెందిన సనాతన్‌ కిషన్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నిందితుడి నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఒక ఇయర్‌ బడ్‌, ఇనుప రాడ్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణకు రాగా ఈ మేరకు నిందితుడికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా, మూడు నెలల సాధారణ జైలుతో పాటు మరో రూ.2 వేల జరిమానాను కోర్టు విధించింది. ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలు కానున్నట్లు ఎస్పీ జీఆర్‌ రాఘవేంద్ర తెలియజేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి తీర్పు వరకు మొత్తం ప్రక్రియను 17 రోజుల్లో పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.

రాయగడ: కట్లాగుడ వంతెనకు దగ్గరలో జంఝావతి పరవళ్లు

భువనేశ్వర్‌: బర్‌గడ్‌ మీదుగా ఛత్తీస్‌గఢ్‌ వైపు అల్ప పీడనం కదులుతున్నందున పశ్చిమ జిల్లాల్లోని ప లు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల పాటు ఒడిశా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్‌ కుమార్‌ పూజారి శుక్రవారం తెలిపారు. ఝార్సుగుడ, సంబల్‌పూర్‌, సువర్ణపూర్‌, బౌధ్‌ మరియు సుందరగడ్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాగల 24 గంటలు రాష్ట్రానికి కీలకం కానున్నాయని మంత్రి తెలిపారు. శనివారం మధ్యాహ్నం సరికి పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుని వర్ష తీవ్రత తగ్గే అవకాశం ఉందన్నారు. కొన్ని నదులలో నీటిమట్టాలు ప్రమాద స్థాయికి పైనే కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. భద్రక్‌ జిల్లాలోని అఖువాపొడా వద్ద వైతరణి నది, మథాని వద్ద జల్కా నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. వర్ష పాతం తగ్గడంతో ఈ రాత్రికి నదుల్లో నీటి మట్టాలు తగ్గుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్‌ వైపు అల్ప పీడనం కదులుతున్నందున రాష్ట్ర అధికారులు ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో నదీ జలాల మట్టాలను, వర్షపాత పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

రాయగడ: భారీ వర్షాలు జిల్లాను వణికిస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలతో జనం అవస్థలు పడుతున్నారు. రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శుక్రవారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో సికరపాయి–భలుమస్కా మధ్య రైల్వే ట్రాక్‌పై రాళ్లు, కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సికరపాయి రైల్వే స్టేషన్‌లో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, కెవుటిగడు రైల్వే స్టేషన్ల వద్ద హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ట్రాక్‌పై పడిన పెద్ద బండరాయిని తొలగించేందుకు నిర్విరామమంగా శ్రమిస్తున్నారు. రైలు రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నట్లు సంబంధిత శాఖ అధికారులు తెలియజేశారు. ఇదిలాఉండగా భారీ వర్షాల కారణంగా రాయగడలోని జంఝావతి నదిలో నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. సెప్టెంబర్‌ 24వ తేదీ సాయంత్రం ఆరు గంటల నాటికి 119.62 మీటర్లకు నీరు చేరుకుంది. నది హెచ్‌ఎఫ్‌ఎల్‌ 120.36 మీటర్లు కాగా ప్రస్తుతం నీటిమట్టం దానికి కేవలం 0.74 మీటరల దిగువన ఉంది.

నీట మునిగిన పంటపొలాలు

స్థానిక సిరికన ప్రాంతంలో సుమారు 15 ఎకరాల పొలాల్లోకి వరద నీరు చేరడంతో పత్తి, రాగులు, వేరుశనగ తదితర పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. అయితే నష్టం అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. వర్షాలు ఇలాగే కొనసాగితే కట్లగుడ వంతెనపై నుంచి నీరు ప్రవహించే అవకాశం ఉండటంతో పాటు సిరికన గ్రామంలోకి కూడా వరద నీరు చేరే ప్రమాదం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మూడు రోజులుగా ఎకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు జనజీవనం కూడా స్తంభించింది. ఇళ్లకే అంతా పరిమితమయ్యారు. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.

మాట్లాడుతున్న కలెక్టర్‌ అక్షయ సునీల్‌ అగర్వాల్‌

హాజరైన రైతులు, వివిధ సంఘాల డైరెక్టర్లు

పర్లాకిమిడి: గజపతి జిల్లాలో సహకార సంఘాల సభ్యుల నమోదు కార్యక్రమం శ్రీసంబంధ్‌శ్రీను జిల్లా పరిషత్‌ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, కలెక్టర్‌ అక్షయసునీల్‌ అగర్వాల్‌ను స్థానిక బిజూ కల్యాణ మండపంలో ప్రారంభించారు. రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి, సహకార సంఘాల మంత్రి ప్రదీప్‌ బోలో సామంత్‌ ప్రారంభించగా గజపతిలో అధికారులు, ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు లబ్ధి కలిగే సహకార సంఘాల సభ్యత్వ నమోదును గజపతి జిల్లాలో అతి తక్కువగా 35 వేల మంది మాత్రమే చేసుకున్నారని, దీనిని రెట్టింపు చేయాలని కోరారు. ప్రతి రైతు కనీసం రూ.20 లు చెల్లించి సభ్యత్వం పొందాలని సూచించారు. గవర తిరుపతిరావు మాట్లాడుతూ.. సభ్యత్వం వల్ల రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, వడ్డీలేని రుణం పొందుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా డీఆర్‌సీఎస్‌ హరిహర శెఠి, పురపాలక సంఘం చైర్మన్‌ నిర్మలా శెఠి, సబ్‌ కలెక్టర్‌ కల్యాణ్‌రావ్‌, జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి ఎం.ప్రకాశరావు, ఎంపీ ప్రతినిధి రొక్కం రాంప్రసాద్‌, ఎస్‌ఆర్‌సీఎస్‌ నీలమాధవ పట్నాయిక్‌, బీజేపీ కృషక్‌ మోర్చా ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌ కుమార్‌ పాలో తదితరులు పాల్గొన్నారు.

ఎడతెరపి లేని వర్షాలు

నీట మునిగిన పంట పొలాలు

రైలు సేవలకు అంతరాయం

ప్రయాణికులకు ఇక్కట్లు

మంత్రి సురేష్‌ కుమార్‌ హెచ్చరిక

ఉప్పొంగుతున్న జలకా, వైతరణి నదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement