రైలు మార్గాల పునరుద్ధరణ వానకు రైలు మార్గాలు దెబ్బ తిన్నాయి. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. –8లోu | - | Sakshi
Sakshi News home page

రైలు మార్గాల పునరుద్ధరణ వానకు రైలు మార్గాలు దెబ్బ తిన్నాయి. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. –8లోu

Sep 26 2026 1:32 AM | Updated on Sep 26 2026 1:32 AM

రైలు మార్గాల పునరుద్ధరణ వానకు రైలు మార్గాలు దెబ్బ తిన్నాయి. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. –8లోu

● 24 గంటల్లో 2649.3 మిల్లీమీటర్ల వర్షపాతం

చందాహండి లో వరద నీటిలో పర్యటిస్తున్న మాజీ మంత్రి రమేష్‌ చంద్ర మజ్జి

కొరాపుట్‌ అతలాకుతలం

కొరాపుట్‌: భారీ వర్షం ధాటికి కొరాపుట్‌, నబరంగ్‌పూర్‌ జిల్లాలు విలవిలలాడాయి. అప్పర్‌ ఇంద్రావతి హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ రిజర్వాయర్‌లో మూడు గేట్లు తెరిచారు. నిండుకుండలా మారిన రిజర్వాయర్‌ పరిస్థితి గమనించిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన గేట్లు తెరవడంతో ప్రళయంలా వరద నీరు పోటెత్తింది. తెంతుల కుంటి, నందాహండి, నబరంగ్‌పూర్‌ సమితులు నీటిలో మునిగి పోయాయి. ఈ దెబ్బకి నబరంగ్‌పూర్‌ పట్టణ వాసులు ఉదయం తలుపులు తెరిచే సరికి తాము సముద్రంలో ఉన్నట్లు భయపడ్డారు. వేకువ జాము నుంచే అధికారులు, ఓడ్రాఫ్‌, అగ్ని మాపక, రెవెన్యూ బృందాలు గ్రామాలు ఖాళీ చేయించడం ప్రారంభించాయి. రోడ్లపై వాహనాలు తలపిస్తూ ఒడ్రాప్‌ పడవలు ప్రజలను తరలించాయి. నబరంగ్‌పూర్‌ ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జి రాత్రంతా పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ గ్రామాలను సమన్వయం పరుస్తూ ప్రజలను ఎగువ ప్రాంతాలకు తరలించారు. నబరంగ్‌ఫూర్‌ జిల్లా కేంద్రంలో జమాల్‌ లైన్‌, మంగళం టింబర్‌ రోడ్డు, తదితర ప్రాంతాలు నదులను తలపించాయి. ఓ ప్రైవేటు విద్యా సంస్థలో చిక్కుకున్న 50 మందిని స్థానికులు రక్షించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని సమితులకు రహదారులు లేకుండా పోయాయి. చందాహండిలో వరద ప్రాంతాలలో మాజీ మంత్రి రమేష్‌ చంద్ర మజ్జి పర్యటిస్తూ ప్రజలకు ఆహార వసతులు సమకూర్చారు. మరో వైపు కొరాపుట్‌ జిల్లాపై వరద బీభత్సం కొనసాగింది. కొరాపుట్‌–బొరిగుమ్మ రహదారిపై కొండ చరియలు పడడం తో వాహనాలు నిలిచిపోయాయి. మాలి గుడ వద్ద రైల్వే మార్గలు కుదించుకుపోయాయి. ప్రజలు చూస్తుండగానే భారీ విద్యుత్‌ టవర్‌ కూలి పోయింది. దాంతో కొరాపుట్‌ వరకే రైళ్లు నడిపారు. అక్కడ నుంచి ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులను జయపూర్‌, జగదల్‌పూర్‌ తరలించారు.

జయపురం: కొరాపుట్‌ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 2649.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. అత్యధికంగా బొయిపరిగుడ సమితిలో 307.3 మిల్లీ మీటర్లు నమోదు కాగా కొట్‌పాడ్‌ లో 272, సెమిలిగుడలో 267, జయపురంలో 258.2 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. భారీ నష్టాల కు గురైన జయపురం సబ్‌డివిజన్‌లో కొట్‌పాడ్‌, కుంద్ర, బొయిపరిగుడ సమితుల్లో రాష్ట్ర పంచాయతీ రాజ్‌ మంత్రి రబినారాయణ నాయిక్‌ వరత పీడిత ప్రాంతాలను పరీక్షించించి పరిస్థితిని సమీక్షించారు. వరద ప్రాంతాల్లో ఉన్న 262 మంది గర్భవతులను మా గృహ కమ్యూనిటీ వైద్య కేంద్రానికి చేర్చారు. వారిలో 129 మంది మహిళలు సురక్షితంగా ప్రసవించినట్లు అధికారులు వెల్లడించారు. కొట్‌పాడ్‌, కుంద్ర, బొయిపరిగుడ, బొరిగుమ్మలో వందకు పైగా ఇళ్లు కూలి పోయినట్లు ప్రాథమిక సమాచారం. ఇళ్లు కూలి నిరాశ్రయులైన దాదాపు వందలాది మంది నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొట్‌పాడ్‌ సమితి చతరంగ్‌, బెడాగుడ, బెలగాం, సిరిసి, చందిలి, విక్రమపూర్‌ తదితర ప్రాంతాలను మంత్రి రబి నారాయణ నాయిక్‌ సందర్శించి బాదిత ప్రజలను నేరుగా కలసి వారికి సమకూరుతున్న పునరావాస సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు కొరాపుట్‌ కలెక్టర్‌ మనోజ్‌ సత్యబాన్‌ మహాజాన్‌, కొరాపుట్‌ ఎస్పీ రోహిత్‌ వర్మ, కొరాపుట్‌ ఎమ్మెల్యే, జిల్లా ప్రణాళిక బోర్డు చైర్మన్‌ రఘునాత్‌ మచ్చ, కొట్‌పాడ్‌ ఎమ్మెల్యే రూపు భొత్ర, జయపురం సబ్‌ కలెక్టర్‌, కొట్‌పాడ్‌ సమితి బీడీఓ సంధ్య సోమరత్‌, తహసీల్దార్‌ ట్వింకిల్‌ సెట్టి, అదనపు తహసీల్దార్‌ పరసురాం భొత్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement