ఘనంగా పండిట్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ జయంతి ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా పండిట్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ జయంతి ఉత్సవం

Sep 26 2026 1:32 AM | Updated on Sep 26 2026 1:32 AM

పర్లాకిమిడి: జాతీయ వాది, ఫిలాసఫర్‌, ఎకాత్మ మానవతావది, పండిట్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ 110వ జయంత్యుత్సవాన్ని స్థానిక ఇరదల వీధి బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కొడేరు నారాయణరావు అతిథిగా పాల్గొని పండిట్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేశారు. జిల్లా బీజేపీ సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో, ఇ.ప్రశాంత్‌, కాశీనగర్‌ మండల అధ్యక్షులు కోడూరు జీవన్‌, నరేష్‌ సాహు, కుమార్‌, కోడూరు కిరణ్‌ ఎంపీ ప్రతినిధి రొక్కం రాంప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement