మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరద నేపథ్యంలో మల్కన్‌గిరి కలెక్టర్ పూర్తి అప్రమత్తమై అన్ని రకాల అత్యవసర చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మాత్తిలి, కలిమెల, పోడియా, కోయిర్‌పూట్ సమితుల్లో సుమారు 28 పంచాయతీలు 37 గ్రామాలు వర్ష ప్రభావానికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలు 2259 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎంవీ 6 గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం వద్ద అటుకులు, పంచదార, బిస్కెట్లు పంపిణీ చేశారు. కలెక్టర్ ప్రథమేశ్ ప్రతి పునరావాస కేంద్రానికి స్వయంగా వెళ్లి ప్రజలకు అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.


