కొత్త విషయాలను నేర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కొత్త విషయాలను నేర్చుకోవాలి

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

కొత్త విషయాలను నేర్చుకోవాలి

ఎచ్చెర్ల : జర్నలిస్టులు నిరంతర విద్యార్థులుగా ఉంటూ కొత్త విషయాలను నేర్చుకోవాలని, జర్నలిజానికి ఉన్న పత్యేకత ఎప్పటికీ అలాగే ఉంటుందని జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు అన్నారు. ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం ఆధ్వర్యంలో జర్నలిస్టులు, గ్రామీణ విలేకర్ల కోసం నిర్వహించిన శిక్షణ కార్యక్ర మం ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్న లిజం తొలినాళ్లలో రేడియో ద్వారా ఆ తర్వాత పత్రికలు ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా ప్రజలకు సమా చారం చేరిందని, ప్రస్తుతం సామాజిక మాధ్యమా లు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. వార్తా సేకరణలో వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న సమాచారాన్ని పరిశీలించి నిజానిజాలను నిర్ధారించుకున్న తర్వాతే వార్తగా ప్రచురించాలని సూచించారు. కార్యక్రమలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.అనురాధ, యూబీఏ సమన్వయకర్త, పీఎం–ఉషా నోడల్‌ అధికారి కావ్యజ్యోత్స్న, సీనియర్‌ జర్నలిస్టు డి.రాజేంద్రప్రసాద్‌, రెడ్డి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement