పెనంతో కొట్టడంతో భార్య మృతి | - | Sakshi
Sakshi News home page

పెనంతో కొట్టడంతో భార్య మృతి

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

భువనేశ్వర్‌: పెనంతో కొట్టడంతో భార్య మరణించిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మృతురాలిని బనస్మిత సాయి (26)గా గుర్తించారు. 5వ నంబరు జోన్‌ ఏసీపీ బిశ్వరంజన్‌ సేనాపతి, నయాపల్లి ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందిత భర్త సర్వేశ్వర్‌ ప్రధాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫోరెన్సిక్‌ బృందం సంఘటనా స్థలంలో నమూనాలు సేకరించింది. ఏడాదిన్నర క్రితం వీరిరువురూ ప్రేమించుకున్న తర్వాత వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 4 నెలల కుమారుడు ఉన్నట్లు కుటుంబీకుల సమాచారం.

దసరా ఉత్సవాలకు అంకురార్పణ

పర్లాకిమిడి: దసరా శరన్నవరాత్రి వేడుకలకు పర్లాకిమిడి పెద్ద బ్రాహ్మణవీధి జంక్షన్‌ వద్ద అంకుర పూజలు చేపట్టారు. అక్టోబర్‌ 11న సప్తపురి అమావాస్య నాటి నుంచి పెద్ద బ్రాహ్మణవీధిలో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే దుర్గా పూజలు నేటికి 65 వసంతాలు నిరాటంకంగా ఇక్కడ జరుపుతున్నారు. కటక్‌ నుంచి కళాకారులను తెప్పించి అత్యంత సుందరంగా దుర్గా అమ్మవారి విగ్రహాన్ని తీర్చిదిద్దుతారు.

నిత్యావసరాల ధరల

పెరుగుదలపై నిలదీత

భువనేశ్వర్‌: కూరగాయలు, వంట నూనె, పంచదార తదితర నిత్యావసర పదార్థాల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ప్రతిపక్ష సభ్యులు శాసన సభ వర్షాకాలం సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇటీవల పలు ఆహార పదార్థాలు, కూరగాయల ధరలు పెరగడానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పంట నష్టం, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలే కారణమని ఒడిశా ప్రభుత్వం పేర్కొంది. అదే సమయంలో బ్లాక్‌ మార్కెటింగ్‌, అధిక లాభాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కూడా స్పష్టం చేసింది. శాసన సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పప్పు ధాన్యాలు, వంట నూనె, ఉల్లిపాయల ధరలలో స్వల్ప పెరుగుదల దేశ వ్యాప్తంగా నెలకొని ఉన్న పరిస్థితిలో భాగమని రాష్ట్ర ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్రో పేర్కొన్నారు. ప్రధాన కూరగాయలు పండే ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం, వరదల వంటి పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతిని, కూరగాయల ధరలు పెరిగాయని మంత్రి తెలిపారు.

లంచాల ఆరోపణలపై దర్యాప్తు

రాయగడ: రాయగడలోని ఓఎస్‌బీసీ (ఒడిశా స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌) డిపోలో మద్యం లోడింగ్‌కు లంచాలు వసూలు చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఎకై ్సజ్‌ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ఆ శాఖ జాయింట్‌ ఎకై ్సజ్‌ కమిషనర్‌ డంబురుధర్‌ ఖండా వర్చువల్‌ విధానంలో దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా ఓఎస్‌బీసీ శాఖ మేనేజర్‌ ఉదయ్‌లాల్‌ నాయక్‌, అకౌంటెంట్‌ అజయ్‌ నాయక్‌, వాహన యజమానులు ప్రాశాంత్‌ నాయక్‌, దీపక్‌ దళాయి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు భవానీ శంకర్‌ జెన తదితరులను ఆరోపణలపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా వాహన యజమానులు ప్రశాంత్‌ నాయక్‌, దీపక్‌ కుమార్‌ దొళాయిలు మాట్లాడుతూ మద్యం లోడింగ్‌కు సంబంధించి ఒకొక్క వాహనానికి గతంలో రూ.10 వేలు చొప్పున లంచం చెల్లించేవారమని, ప్రసుతం ఆ మొత్తం రూ.20 వేలకు పెరిగిందని ఆరోపించారు. లంచం చెల్లించకపోతే మద్యం లోడింగ్‌కు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. బ్రాంచ్‌ మేనేజర్‌ నేరుగా డబ్బులు తీసుకోకుండా ఓఎస్‌బీసీ అకౌంటెంట్‌ ఆజయ్‌ నాయక్‌ ఫోన్‌పే ద్వారా నగదు తీసుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు భవానీ శంకర్‌ జెన్న మాట్లాడుతూ వెండర్లు కోట్ల రుపాయల విలువైన మద్యం తీసుకొని ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నప్పటికీ, ఓఎస్‌బీసీ అధికారులు లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు గతంలోనూ వచ్చాయని తెలిపారు. దీనికి సంబంధించి తన వద్ద పత్రాలు ఉన్నాయని, వాటిని ఏడు రోజుల్లో అందజేస్తానని దర్యాప్తు చేపట్టే అధికారికి వివరించారు. విచారణ సమయంలో జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ సంతోష్‌ కుమార్‌ దళసామంత్‌ కూడా హాజరయ్యారు. ఆరోపణలకు సంబంధించిన అన్ని లిఖిత పూర్వకపత్రాలను రాయగడ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌కు అందజేయాలని జాయింట్‌ ఎకై ్సజ్‌ కమిషనర్‌ డంబుఽరుధర్‌ ఖండా ఆదేశించారు. అలాగే ఫిర్యాదుదారుల వద్ద ఉన్న పత్రాలను వెంటనే ఈ–మెయిల్‌ ద్వారా పంపాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement