నష్టం స్వల్పమే | - | Sakshi
Sakshi News home page

నష్టం స్వల్పమే

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

భువనేశ్వర్‌: ఉత్తర ఆంధ్రప్రదేశ్‌, దక్షిణ ఒడిశా తీరాలను ప్రభావితం చేసిన తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు పెద్ద నష్టం గానీ, ప్రాణ హాని గానీ జరగలేదని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సురేష్‌ కుమార్‌ పూజారి తెలిపారు. బుధవారం రాత్రి కళింగ పట్నం సమీపంలో తీవ్ర అల్ప పీడనం తీరాన్ని దాటిన తర్వాత రాష్ట్ర, జిల్లా స్థాయిలలో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. తీవ్ర అల్పపీడనం భూభాగంలోకి ప్రవేశించి క్రమంగా బలహీనపడుతోందని, దక్షిణ, పశ్చిమ ఒడిశాలోని జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసి ఓడీఆర్‌ఏఎఫ్‌, అగ్ని మాపక దళాలు, క్షేత్ర స్థాయిలో అనుబంధ కార్యకలాపాల్లో తలమునకలై ఉన్నారని మంత్రి తెలిపారు. కొరాపుట్‌, మల్కన్‌గిరి, గజపతి మరియు నవరంగ్‌పూర్‌ జిల్లాల్లో భారీ వర్ష పాతం నమోదైందన్నారు. పలు జిల్లాలకు గురువారం రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగాలు, సహాయక దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, రాత్రి గస్తీ, ట్రాఫిక్‌ నిర్వహణ, నీటిమట్టం పర్యవేక్షణ, పునరుద్ధరణ చర్యలు చురుకుగా కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement