జగబంధు త్యాగం చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

జగబంధు త్యాగం చిరస్మరణీయం

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

కొరాపుట్‌ :

మీ బలిదానాలు జాతి మరువదని ప్రతిపక్ష బీజేడీకి చెందిన మాజీ మంత్రి రమేష్‌చంద్ర మజ్జి ప్రకటించారు. గురువారం నబరంగ్‌పూర్‌ జిల్లా రాయిఘర్‌ సమితి గుణ సంత ప్రాంతంలో జగబందు స్మారక స్థూపం వద్ద జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. 16 ఏళ్ల క్రితం ఇదే రోజు సంతలో గిరిజనులతో మమేకమైన బీజేడికి చెందిన ఉమ్మర్‌ కోట్‌ ఎమ్మెల్యే జగబంధు మజ్జిని మావోయిస్టులు కాల్చి చంపారన్నారు. అతనిని రక్షించే క్రమంలో జగబందు గన్‌మేన్‌ ప్రశాంత్‌ పాత్రో కూడా మృతి చెందినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుభాష్‌ గొండో, దళిత ఉద్యమ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement