భారీ వర్షాలకు ..
రాయగడ :
అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు రాయగడ జిల్లాలో పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. బిసంకటక్ సమి నువాగాంలో రెండు మట్టి ఇళ్లు కూలిపొయాయి. సదరు సమితి శెశిఖాల్‌పోలీస్ స్టేషన్ ఎదుట భారీ చెట్టు నేలకొరిగింది. దీంతో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. గుమ్మ ఘాటీలో కొండచరియలు, చెట్లు విరిగిపడటంతో 326 నంబరు జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. జంఝావతి నదిలో నీటిమట్టం పెరిగింది. కొరాపుట్–రాయగడ (కే ఆర్ ) రైల్వే లైన్‌లో టికిరి సమీపంలో ట్రాక్‌పై కొండచరియలు, మట్టి పడిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రవులి రైల్వే స్టేషన్ మధ్య టన్నల్ నంబరు 3 సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న రాయగడ రైల్వే శాఖ ప్రత్యేక బృందం సంఘటన స్థలానికి చేరుకుని మూడు గంటల పాటు శ్రమించి ట్రాక్‌పై పడిన మట్టిని తొలగించారు. బిసంకటక్‌లోని నువాగాంలో ఇంటి గోడలు కూలిపోయాయి. విషయం తెలుసుకున్న బీడీఓ శివ పట్నాయక్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఘటనా స్థలానికి చేరుకుని టార్పాలిన్లు అందజేశారు.


