రాష్ట్ర స్థాయిలో సత్తాచాటిన క్రీడాకారులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయిలో సత్తాచాటిన క్రీడాకారులు

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

పర్లాకిమిడి: కెందూఝర్‌ జిల్లాలో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకూ జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండ్‌ పోటీల్లో గజపతి జిల్లాకు చెందిన ఐదుగురు విద్యార్థులు స్వర్ణం, కాంస్య, రజిత పతాకాలు సాధించారు. గజపతి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చారని గజపతి తైక్వాండ్‌ అకడమీ కార్యదర్శి కార్తీక్‌ మహాపాత్రో గురువారం తెలియజేశారు. రాష్ట్ర తైక్వాండ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలకు గజపతి నుంచి 19 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో ఆరుగురు విద్యార్థులు పతకాలు సాధించారు. వీరు కృష్ణచంద్రగజపతి కళాశాల విద్యార్థిని వర్షితా దాస్‌ అండర్‌ 17 క్యాటగరీలో స్వర్ణం, భువనానంద భుయ్యాన్‌ (ఎస్‌.కె.సి.జీ.కళశాల) అండర్‌ 17 స్వర్ణం, కె.స్వరణ్‌ తేజ్‌ (మహారాజా బాలుర ఉన్నత పాఠశాల) అండర్‌ 17 స్వర్ణం, ఎన్‌.హేమంత్‌ (మహారాజా బాలుర ఉన్నత పాఠశాల) కాంస్యం, జగన్నాథ శోబోరో (సరస్వతీ శిశువిద్యామందిర్‌) అండర్‌ 14 రజితం, జ్ఞాణేంద్ర భుయ్యాన్‌ (సరస్వతీ శిశుమందిర్‌) అండర్‌ 14లో కాంస్య పతకం సాధించినట్లు కార్తీక్‌ మహాపాత్రో తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement