ఎచ్చెర్ల : శాంతి స్థాపనలో యోగా కీలక పాత్ర వహి స్తుందని బీహార్ రాష్ట్రం పాటలీపుత్ర వర్సిటీకి చెంది న ప్రొఫెసర్ అభాసింగ్ చెప్పారు. నేటి సంక్షోభ పరిస్థితుల్లో దేశాల మధ్య ఘర్షణలు తగ్గించేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. శాంతి భిన్న సంస్కృతులపై ఎచ్చెర్లలోని డాక్టర్ బి. ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో భాగంగా గురువారం ఆమె ప్రసంగించారు. శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ ఫిలా సఫీ మాజీ విభాగాధిపతి ప్రొఫెసర్ బి.సాంబశివప్రసాద్, ప్రొఫెసర్ సచ్చిదానందమూర్తి తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలహాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ భీమకుమార్ వివిధ సంస్కృతుల్లో శాంతిస్థాపనకు బుద్ధుడి బోధనలు ఎలా ఉపయోగపడతాయో వివరించారు. అనంతరం 20 మంది పరిశోధకులు తమ పత్రాలను సమర్పించా రు. కార్యక్రమంలో వీసీ కె.ఆర్.రజనీ, రిజిస్ట్రార్ బి. అడ్డయ్య, సదస్సు కన్వీనర్లు సంతోష్ రంగనాథ్, సంతోషి పావని, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అనురా ధ, సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ స్వప్రవాహిని, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


