అంత్యక్రియలకూ అవస్థలే! | - | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలకూ అవస్థలే!

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

అంత్యక్రియలకూ అవస్థలే! ● రైలు ప్రమాదంలో మృతి చెందిన శివకు అడవిలో అంతిమ సంస్కారాలు ● గిరిజనులకు శ్మశాన వాటిక లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు మృతుల కుటుంబాలను ఆదుకోవాలి...

● రైలు ప్రమాదంలో మృతి చెందిన శివకు అడవిలో అంతిమ సంస్కారాలు ● గిరిజనులకు శ్మశాన వాటిక లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు

మెళియాపుట్టి : రైలు ఢీకొన్న ఘటనలో మృతిచెందిన శివకు అంత్యక్రియలు నిర్వహించేందు కు గురువారం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యా యి. మెళియాపుట్టి మండల కేంద్రంలో నివాసముంటున్న గిరిజనులకు తరతరాలుగా శ్మశాన వాటిక లేకపోవడంతో అడవిలోనే అంత్యక్రియ లు నిర్వహించారు. తరాలు మారినా గిరిజనుల తలరాత మారడం లేదని పలువురు గిరిజనులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి శ్మశాన వాటిక మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.

టెక్కలి: రైలు ఢీకొన్న ఘటనలో విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని, ఆయా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం డిమాండ్‌ చేశారు. గురువారం టెక్కలి మండలం డమర, భీంపురం గ్రామాల్లో మృతుల కుటుంబాలను పరామర్శించి రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం టెక్కలి–మెళియాపుట్టి రోడ్‌లో పురుషోత్తంసాగర్‌ గండి వల్ల ఏర్పడిన వరద నీటితో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement