అరసవల్లి ఈఓ దీర్ఘకాలిక సెలవుకు నో! | - | Sakshi
Sakshi News home page

అరసవల్లి ఈఓ దీర్ఘకాలిక సెలవుకు నో!

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

అరసవల్లి ఈఓ దీర్ఘకాలిక సెలవుకు నో! ● విధుల్లోకి చేరాల్సిందేనని ఆదేశించిన రాష్ట్ర కమిషనర్‌ ● విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతరకు సీఎఫ్‌వోగా నియామకం

● విధుల్లోకి చేరాల్సిందేనని ఆదేశించిన రాష్ట్ర కమిషనర్‌ ● విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతరకు సీఎఫ్‌వోగా నియామకం

అరసవల్లి: ఒత్తిళ్లు..అనారోగ్య కారణాలు చూపుతూ ధీర్ఘకాలిక సెలవులు పెట్టేస్తే ఎలా..?అంటూ అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి ఆలయ ఈవో కె.ఎన్‌.వి.డి.వి.ప్రసాద్‌పై దేవదాయ శాఖ రాష్ట్ర కమిషన ర్‌ రామచంద్రమోహన్‌ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆలయ భూముల ఎన్‌వోసీ జారీపై కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ ఆగ్రహానికి గురైన ఈవో..ఒత్తిళ్లకు తట్టుకోలేనంటూ అనారోగ్య కారణాలు చూపుతూ నెల రోజుల పాటు సెలవుకు దరకాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.. దీనిపై రాష్ట్ర కమిషన ర్‌ రామచంద్రమోహన్‌ మాత్రం ఎలాంటి ఆమోదం తెలియజేయలేదు సరికదా.. విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో)గా బాధ్యతలు అప్పగిస్తే.. ఎలా తప్పించుకుని సెలవులు పెట్టేస్తావంటూ కమిషనర్‌ ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో కమిషనర్‌ ఆదేశాల మేరకు తిరిగి అరసవల్లి ఆలయానికి ఈవోగా గురువారం విధుల్లోకి ప్రసాద్‌ చేరారు. కాగా విజయనగరం మాన్సాస్‌కు కూడా ఈయనే ఈవో కావడంతో పైడితల్లి అమ్మవారి జాతర పనుల పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించారు. స్థానిక జిల్లాలో అరసవల్లి ఆలయ స్థలాల ఎన్‌వోసీపై ఈవో ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడంపై మరోవైపు జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అదే మండిపాటు ధోరణిలోనే ఉన్నారని తెలుస్తోంది. దీంతో అటు రాష్ట్ర కమిషనర్‌ రామచంద్రమోహన్‌.. ఇటు జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ల నుంచి చెరోవైపు ఒత్తిళ్లను భరించలేకపోతున్నానంటూ ఈవో తన సన్నిహితుల వద్ద వాపోతున్నారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement