హాస్టల్‌ వార్డెన్‌ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ వార్డెన్‌ సస్పెన్షన్‌

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

హాస్టల్‌ వార్డెన్‌ సస్పెన్షన్‌

టెక్కలి: టెక్కలి గిరిజన పోస్టుమెట్రిక్‌ హాస్టల్‌ వార్డెన్‌ ఎస్‌.సుదర్శనరావును సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు. వసతి గృహానికి చెందిన ఇంటర్‌ విద్యార్థులు జన్ని దిలీప్‌కుమార్‌, జన్ని శరత్‌కుమార్‌, గంగువాడ విశాఖరావు, సవర శివ రెండు రోజుల బుధవారం టెక్కలి సమీపంలో రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొని మృతి చెందిన సంగతి విదితమే. వార్డెన్‌ సుదర్శనరావు పర్యవేక్షణ లోపం, బోగస్‌ హాజరుతో ఇటువంటి సంఘటన చోటు చేసుకుందనే కారణంతో సస్పెన్షన్‌ చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ డీడీ అన్నాదొర తెలిపారు.

విద్యార్థి కుటుంబానికి మంత్రి పరామర్శ

మెళియాపుట్టి: టెక్కలి మండలం రావివలస సమీపంలో రాజారాణి రైలు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. మృతుల్లో మెళియాపుట్టి మండల కేంద్రానికి చెందిన సవర శివ ఉండటంలో గురువారం మంత్రి అచ్చెన్నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తిలు విద్యార్థి తల్లిదండ్రు లను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రితో మాట్లాడి రూ.ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇప్పిస్తానన్నారు. పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం టెక్కలి మండలం డమర, భీంపురం గ్రామాల్లో పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement