మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు

Sep 24 2026 2:30 AM | Updated on Sep 24 2026 2:30 AM

భువనేశ్వర్‌: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఒడిశా మత్స్యశాఖ డైరెక్టరేట్‌ తీర ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేసింది. ఈ నెల 25 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులను వెంటనే ఒడ్డుకు తిరిగి రావాలని కోరింది. చేపల పడవలు, ట్రాలర్లను సమీపంలోని చేపల ల్యాండింగ్‌ కేంద్రాలు లేదా ఫిషింగ్‌ హార్బర్‌ల వద్ద సురక్షితంగా నిలిపి ఉంచాలని మత్స్యశాఖ ఆదేశించింది. తాజా వాతావరణ పరిస్థితుల గురించి మత్స్యకారులను అప్రమత్తం చేయడానికి తీర ప్రాంతాల్లో మైకుల ద్వారా ప్రచారం ముమ్మరం చేశారు. జిల్లా మత్స్యశాఖ అధికారులు, సముద్ర మత్స్యశాఖ అధికారులు పడవ యజమానులు, ట్రాలర్‌ యజమానుల సంఘాలు, సముద్ర మత్స్యకారుల సహకార సంఘాలకు ముందు జాగ్రత్త చర్యల గురించి అవగాహన కల్పించారు. మత్స్య శాఖ అన్ని జిల్లా కార్యాలయాల్లో 24 గంటల కంట్రోల్‌ రూమ్‌లు తెరిచింది. కటక్‌లోని మత్స్య శాఖ డైరెక్టరేట్‌తో నిరంతర సంప్రదింపులు జరుపుతూ తాజా పరిస్థితి నివేదికలను అనుక్షణం సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. మత్స్యశాఖ అధికారులు, ఉద్యోగులు సెలవులను రద్దు చేసింది. ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. మత్స్యకారులలో అవగాహన కల్పించేందుకు వివిధ ఓడరేవులలో సాగర్‌ మిత్రులు, సహాయక మత్స్య అధికారులను నియమించింది.

గాంధీ మార్గ్‌లో బీజేడీ గర్జన

భువనేశ్వర్‌: రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని విపక్ష బిజూ జనతా దళ్‌ ఆందోళన ఉధృతం చేసింది. పాఠ్య పుస్తకాల్లో అచ్చు తప్పులు బాలల బంగారు భవిష్యతుని మసకబార్చుతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది.. బాలలకు నాణ్యమైన పాఠ్య పుస్తకాల్ని సరఫరా చేయడంలో విఫలమైన చర్యకు నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని బిజూ జనతా దళ్‌ యువత, విద్యార్థి వర్గాలు బుధవారం నిరసన చేపట్టారు. లోయర్‌ పీఎంజీలో భారీ ఆందోళన చేపట్టారు. అడ్డుకట్టలు తెంచుకుని శాసన సభ వైపు దూసుకు పోయేందుకు విఫలయత్నం చేశారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ వర్గాలు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మరోవైపు బీజేడీ అగ్ర శ్రేణి నాయకులు ఆందోళన శిబిరం ప్రాంగణానికి వెళ్లి యువత, విద్యార్థి వర్గాలకు మద్దతు ప్రకటించి ప్రోత్సహించారు.

అప్పర్‌ కొలాబ్‌ కెనాల్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

జయపురం: జయపురం అప్పర్‌ కొలాబ్‌ సాగునీటి కెనాల్‌లో గల్లంతైన యువకుడు శవమై తేలాడు. స్థానిక భూపతి వీధి చెందిన రాజేష్‌ పట్నాయక్‌ (21) నాలుగు రోజుల కిందట పూర్ణఘడ్‌ ప్రాంతంలోని అప్పర్‌ కొలాబ్‌ సాగునీటి కెనాల్‌కు స్నానానికి వెళ్లాడు. స్నానం చేస్తున్న సమయంలో కాలుజారి కాలువలో జారి పడిపోయాడు. అతడి మొబైల్‌ ఫోను, చెప్పలు కెనాల్‌ ఒడ్డున ఉన్నాయి.స సమాచారం అందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకొని కెనాల్‌ అంతా గాలించారు. అయినా రాజేష్‌ ఆచూకీ తెలియరాలేదు. రెస్క్యూ ఆపరేషన్‌కు సహకరించేందుకు సతిగుడ డ్యామ్‌ నుంచి కెనాల్‌ నీటి ప్రవాహాన్ని నియంత్రించారు. అయినా అతడి జాడ తెలియలేదు. తరువాత ఓడీఆర్‌ఎఫ్బృందం, స్కూబా డ్రైవర్ల సహకారంతో కెనాల్‌లో ఒక కిలోమీటర్ల దూరం వరకు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. అయితే మంగళవారం కెనాల్‌లో తేలుతున్న రాజేష్‌ మృతదేహాన్ని స్థానికులకు కనిపించటంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో వచ్చి మృతదేహాన్న వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement