కొరాపుట్ : ప్రతిపక్ష బీజూ జనతాదల్‌లో శక్తివంతమైన సుజాతా కార్తికేయన్‌తో డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి భేటీ అయ్యారు. మంగళవారం రాజధానిలో జరిగిన ఈ భేటీ పట్ల సంచలనంగా మారింది. అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి బీజేడీపై రంధారి మాత్రమే గెలుపొందారు. మరో వైపు బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్‌కు ముఖ్యమైన ఆంతరంగికుడిగా కార్తికేయ పాండ్యన్ ఉన్నారు. పాండ్యన్ సతీమణి కావడంతో సుజాతా కార్తికేయన్ తన ఐఎఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇటివలే బీజేడీలో చేరారు. ప్రస్తుతం పార్టీలో ముఖ్యమైన అధికార కేంద్రంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాంధారి అవిభక్త కొరాపుట్ జిల్లాలో పార్టీ పరిస్థితిని సుజాతాకు వివరించారు.


