మాలీ పర్వతాన్ని రక్షించండి | - | Sakshi
Sakshi News home page

మాలీ పర్వతాన్ని రక్షించండి

Sep 23 2026 1:07 AM | Updated on Sep 23 2026 1:07 AM

● పీసీసీ మాజీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌

రాయగడ: మాలీ పర్వతాన్ని రక్షిస్తేనే ఒడిశాను రక్షించినట్లవుతుంది. ఈ నేల కోసం పోరాడిన సహీద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ వారసులు ఇప్పుడు ముందుకు వచ్చి తమ భూమి, అడవులు, పర్వతాలను కాపాడేందుకు పోరాడాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీమాజీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ అన్నారు. రాయగడలో కాంగ్రెస్‌ నాయకులు సోమవారం నిర్వహించిన పరివర్తన్‌ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చారు. అనంతరం విలేకర్లతో కాసేపు ముచ్చటించారు. రాయగడ, కొరాపుట్‌, కలహండి జిల్లాల్లోని వందలాది జలధారలు ఎండిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అన్నారు. దేవమాలి, సిజిమాలి, కుట్రుమాలి, శశుబహుమాలి వంటి పర్యత సంపదను పరిశ్రామిక సంస్థల నుంచి రక్షించాల్సిన సమయం వచ్చిందన్నారు. మాలి పర్వత పరిరక్షణ కోసం ఎంతటి త్యాగాలకై నా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మన రక్తంలో సహీద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ వారసత్వం ఉంది. అడవులు, భూమి, మట్టి, పర్వతాల పరిరక్షణ కోసం పారాడాలన్నారు.

ఎంఎండీఆర్‌ సవరణ చట్టంపై విమర్శలు..

ఎంఎండీఆర్‌ చట్టం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఒడిశా ప్రయోజనాలకు నష్టం కలిగిస్తోందని పట్నాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒడిశాకు మైనింగ్‌ సెస్సు ద్వారా 53 వేల కోట్ల రుపాయల ఆదాయం వస్తోందని, మరో 15 వేల కోట్ల ఆదాయాన్ని పొందే అవకాశం ఉన్నప్పటికీ కొత్త చట్టంతో అది నిలిచిపోయిందన్నారు. బాకై ్సట్‌ తవ్వకాల వల్ల దీర్ఘకాలంలో ఈ ప్రాంత పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. కంపెనీల ముందు చేతులు చాచి స్వాభిమానాన్ని కోల్పోవద్దన్నారు. రాయగడ, కొరాపుట్‌, కలహండి ప్రాంతాలను రక్షించేందుకు ప్రజల ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. భూమి కోసం పోరాడుతున్న నరసింగదేయి మాఝి, లొద్ద సికక తదితరులను ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేస్తోందని ప్రశ్నించారు. అన్యాయానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement