రాయగడ: వివిధ ప్రజా సమస్యలు, అభివృద్ధి డిమాండ్ల పరిష్కారం కోరుతూ గుడారి పట్టణ వాసులు మంగళవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ బంద్ కారణంగా జనజీవనం స్తంభించింది. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు బంద్‌కు సంపూర్ణ మద్దతు పలికారు. అత్యవసర సేవలను మినహాయించి దుకాణాలు, మార్కెట్లు, పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. గుడారికి రాకపోకలు సాగించే వాహనాలను కూడా నిలిపివేశారు. పట్టణ వాసుల ప్రధాన డిమాండ్లలో వంఽశధార నదిపై బిజు సేతు నుంచి సిరిగుడ జంక్షన్ వరకు రహదారి నిర్మాణం, గుడారి నుంచి భువనేశ్వర్, కటక్‌లకు ఓఎస్‌ఆర్టీసీ సర్వీసులు ప్రారంభించడం, గుడారి నుంచి కరలాఘాటి మీదుగా బిసంకటక్ వరకు రెండు లైన్ల రహదారి నిర్మాణం ఉన్నాయి.
బరంపురం–జయపురం ఎక్స్‌ప్రెస్ వే, పర్లాకిమిడి–అంబొదల మార్గాలను అనుసంధానం చేయాలని ఈ బంద్ పాటించారు.


