63 కిలోల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

63 కిలోల గంజాయి స్వాధీనం

Sep 23 2026 1:07 AM | Updated on Sep 23 2026 1:07 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

● నిందితుడు పరారీ

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి పోలీసులు సోమవారం రాత్రి పెట్రోలింగ్‌ నిర్వహించారు. కలిమెలకు 20 కిలో మిటర్ల దూరంలో బేజంగవాడ పంచాయతీ పరిధిలో గల కెనాల్‌ రోడ్డులో మారుతి కారు అతివేగంగా రావడంతో నిలిపి తనిఖీ చేశారు. అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కలిమెల అదనపు తహసీల్దార్‌ రాజీవ్‌ బెహరా, ఐఐసీ ప్రభుదత్తు బిశ్వాల్‌ సమక్షంలో తూకం వేయగా 63 కిలోలు ఉంది. దీని విలువ రూ.6.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రైవర్‌ పారారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కారును స్వాధీనం చేసుకుని కలిమెల పోలీసు స్టేషన్‌ వద్ద ఉంచారు.

ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి, శ్రీకాకుళం రూరల్‌ మండలం సొట్టవానిపేట పెట్రోల్‌ బంకు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ఢీకొని వ్యక్తి మృతి చెందారు. ఆమదాలవలస ఎస్‌ఐ సనపల బాలరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం రూరల్‌ మండలం నవనంబాబు గ్రామానికి చెందిన చల్లా బుచ్చిబాబు(45) తన గ్రామం నుంచి బలగలో ఉండే తన భార్య లక్ష్మి వద్దకు వెళ్లేందుకు బయల్దేరాడు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఆయనను నరసన్నపేట వైపు నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుని భార్య చల్లా లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement