వరకట్నం, గృహ హింసలకు అడ్డుకట్ట వేయాలి | - | Sakshi
Sakshi News home page

వరకట్నం, గృహ హింసలకు అడ్డుకట్ట వేయాలి

Sep 23 2026 1:07 AM | Updated on Sep 23 2026 1:07 AM

రాయగడ: వరకట్నం వేధింపులు, గృహ హింసకు అడ్డుకట్ట వేస్తూ మహిళలకు సకాలంలో న్యాయ, సంస్థాగత సహాయం అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రవీంద్రనాఽథ్‌ కుహోరో పిలుపునిచ్చారు. వరకట్న నిషేధ చట్టం–1961, మహిళలను గృహ హింస నుంచి రక్షించే చట్టం–2005పై రాయగడ జిల్లా పరిషత్‌ కార్యాలయం సమావేశం హాల్‌లో మంగళవారం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవీంద్రనాఽథ్‌ కుహోరో మాట్లాడుతూ.. మహిళల భద్రత, గౌరవం, హక్కులను కాపాడటంతో పాటు బాఽధితులకు సకాలంలో చట్టపరమైన పరిహారం అందించాల్సిన అవసరాన్ని వివరించారు. కట్నం, గృహ హింసను అరికట్టేందుకు నిరంతర అవగాహనతో పాటు సమిష్టి చర్యలు అవసరమని పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడం ద్వారా చట్టాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారి మీనతీ దేవ్‌ స్వాగత ప్రసంగంలో కట్న నిషేధ చట్టం–1961, గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం–2005పై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని అన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాది రవినారాయణ శతపతి పాల్గొన్నారు. వరకట్న నిషేధ చట్టంపై పలువురు సీనియర్‌ న్యాయవాదులు ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement