తెరుచుకున్న దండుమారెమ్మ గుడి తలుపులు | - | Sakshi
Sakshi News home page

తెరుచుకున్న దండుమారెమ్మ గుడి తలుపులు

Sep 22 2026 1:06 AM | Updated on Sep 22 2026 1:06 AM

● దసరా వేడుకలకు సన్నాహాలు

పర్లాకిమిడి: ఏడాదికి ఒక్కసారి మాత్రమే దసరా ఉత్సవాలకు ముందు తెరిచే దండుమారెమ్మ తల్లి గుడి ఆదివారం తెరిచారు. ఏటా దసరా శరన్నవరాత్రులకు 15 రోజుల ముందు ఈ దండుమారెమ్మ గుడి తెరుస్తారు. అయితే ఈ ఏడాది అధిక మాసం వల్ల నవమి ఆదివారం నాడు తలుపులు దండుమారెమ్మ కమిటీ తెరిచారు. గుడిలో పెద్ద పాముపుట్టతో పాటు ఆమ్మవారి విగ్రహం వద్ద అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. ఏటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు అనంతరం విజయదశమి నాడు రాత్రి అమ్మవారి గుడి తలుపులు మూసేస్తారు. ఏడాది తర్వాత విజయదశమికి పదిహేను రోజుల ముందు గుడి తలుపులు తెరవడంతో దసరా ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఒడిశా రాష్ట్రం నుండే కాక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ నుంచి వేలాది మంది భక్తులు ఈ గుడికి దసరాకు వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారని కమిటీ సభ్యులు తెలియజేశారు. అసంఖ్యాక భక్తుల విశ్వాసాలకు నిలయమైన దండు మారెమ్మ గుడి పర్లాకిమిడిలో డోలా ట్యాంకు రోడ్డులో దండుమారెమ్మ వీధిలో కొలువై ఉంది. భక్తులు ఈ గుడికి వేలాది రూపాయల విరాళాలు ఇవ్వడంతో గుడి వద్ద అన్నప్రసాదాల మండపం, అమ్మవారి గుడి ముందర స్వాగత ద్వారం, అమ్మవారి కొత్త విగ్రహం ఏర్పాటు చేశారు.

అక్టోబరు 11 నుంచి దసరా ఉత్సవాలు

దండుమారెమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 11 నుంచి జరపనున్నట్టు ఆలయ కమిటీ తెలియజేసింది. ఇప్పటి నుంచి అమ్మవారి గుడికి రంగులు, వెల్ల వేసి ముస్తాబు చేస్తామని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement