జయపురం: శాంతికుజ్ హరిద్వార్ నుంచి 251 కుండీయ గాయిత్రీ మహాయజ్ఞం నిమిత్తం 251 గ్రామాల నుంచి 130 మంది ఆధ్వర్యంలో రుతుంబరా పాత్రో, నిరంజన్ పాణిగ్రహి, గంగాధర పాణిగ్రహి, గోపాల పాత్రోల పర్యవేక్షణలో జయపురం తీసుకువచ్చిన దివ్య శక్తి కలశానికి జయపురంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఝాంకఢ్ దేవీ మందిరం వద్ద స్థానిక ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, మహాయజ్ఞ కమిటీ అధ్యక్షుడు ప్రకాశ్ చంధ్ర నాయిక్, కమిటీ సభ్యులు వాల్మీకి ప్రధాన్, రజిత్ షొండి, చిన్మయ సాహు, స్థానిక సరస్వతీ శిశు మందిర ప్రధాన ఉపాధ్యాయులు, గురువులు కార్యకర్తలు కలశాన్ని ఎత్తి శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక లింగరాజ్ నగర్ గల గాయత్రీ ప్రజ్ఞా పీఠం వద్ద పంకజనయన పాత్రో, కిశోర్ నాయిక్, సురేష్ సాహు, ప్రమీలా మహాపాత్ర, దివ్య శక్తి కలశానికి స్వాగతం పలికారు. గురుద్వార్ నుంచి భజన సింగ్‌తో పాటు అన్ని ఆధ్యాత్మిక, సామాజిక సంస్థలు యువజన సంఘాలు, నగర వాసులు, మేధావులు పుష్పగుచ్ఛాలు పూల దండలతో, గంటలు మోగిస్తూ, తాళాలు, మృదంగాలు వాయిస్తూ, శంఖాలు పూరిస్తూ స్వాగతం పలికారు.


