గజపతి జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గజపతి జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌

Sep 22 2026 1:06 AM | Updated on Sep 22 2026 1:06 AM

పర్లాకిమిడి: భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం 23, 24 తేదీల్లో తుఫాన్‌ వల్ల గజపతి జిల్లాకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. దీంతో గజపతి కలెక్టరేట్‌లో సోమవారం ఏడీఎం మునీంద్ర హానగా జిల్లా ముఖ్య అధికారులతో భువనేశ్వర్‌ నుంచి వర్చువల్‌ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లాపరిషత్‌ సీడీఓ దయామయ పాఢి, అత్యవసర అధికారి బినాయక్‌ రావల్‌, సబ్‌కలెక్టర్‌ భగత్‌ సామల్‌ కళ్యాణ్‌ రావ్‌, ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు అభిషేక్‌ శెఠి, జిల్లా ముఖ్యవైద్యాధికారి, ఏడీఎం ఫల్గునీ మఝి, ఇతర అధికారులు పాల్గొన్నారు. గజపతి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలైన గుమ్మ, రామగిరి, నువాగడలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ఆర్‌అండ్‌ బీ, అగ్నిమాపక దళం, బహుళార్ధ సాధక తుపాను ఆశ్రయాలు తనిఖీలు చేయాలని అధికారులను ఏడీఎం ఆదేశించారు. ఏజెన్సీలో ప్రాథమిక పాఠశాలలో ఆశ్రమం పొందిన బాధితులకు అటుకులు, బెల్లం, పంచదార, కొవ్వొత్తులు, ఆహారం అందించాలని సంబంధిత బీడీఓలను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement