చేనేత కార్మికులకు.. పెహచాన్‌ కార్డులు | - | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికులకు.. పెహచాన్‌ కార్డులు

Sep 21 2026 12:32 AM | Updated on Sep 21 2026 12:32 AM

చేనేత కార్మికులకు.. పెహచాన్‌ కార్డులు

● ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేస్తున్న కేంద్రం

● వినియోగించుకోవాలంటున్న అధికారులు

నందిగాం: చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేస్తోంది. సంబంధిత శాఖ ద్వారా పెహచాన్‌ కార్డులను జారీ చేస్తోంది. మగ్గం నేసే కార్మికులకు, చేనేత అనుబంధ పనులు చేసేవారికి మేలు చేసేందుకు మినిస్ట్రీ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ ద్వారా ఉచితంగా పెహచాన్‌ కార్డులను పంపిణీ చేస్తోంది. ఈ గుర్తింపు కార్డుల వల్ల చేనేత కార్మికులకు అధికారిక గుర్తింపు లభించడంతో పాటు ప్రభుత్వం అందించే చేనేత సంక్షేమ పథకాలు పొందడానికి, రాయితీలు, శిక్షణ, పరికరాలు వంటి ప్రయోజనాలకు అర్హత నిర్ధారణలో ఈ కార్డులు ఉపయోగపడతాయి. బ్యాంకు రుణాలు, బీమా తదితర పధకాల్లో గుర్తింపుగా ఉపయోగపడే అవకాశం ఉంది. చేనేత వృత్తిగా జీవిస్తున్న వారందరూ ఈ–పెహచాన్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, బ్యాంకు ఖాతా వివరాలు, సంతకం, ఫోన్‌ నంబరు, వృత్తికి సంబంధించిన వివరాలు సమర్పిస్తే ఆ వివరాల ప్రకారం చేనేత శాఖకు సంబంధించిన అధికారులు నేరుగా దరఖాస్తు చేసుకున్న కార్మికుని ఇంటికి వచ్చి పరిశీలిస్తారు. దరఖాస్తుదారులు మగ్గం నేస్తున్నారా లేదా అనుబంధ పనులైన రాట్నం నుంచి నూలు వడకడం, కండెలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement