మల్కన్‌గిరి: యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజాశిర్కే అన్నారు. మల్కన్‌గిరిలోని ప్రభుత్వ ఐటీఐలో డి.పి.ఐ.ఐ.టి ఆధ్వర్యంలో తేజ్‌స్ వర్క్‌షాప్‌ను ఆదివారం నిర్వహాంచారు. ఈ వర్క్‌షాప్ ద్వారా టియర్–2, టియర్–3 ప్రాంతాల్లో అట్టడుగు స్థాయి ఆవిష్కరణలు, పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం ద్వారా వికసిత్ భారత్ 2040 లక్ష్యాన్ని సాకారం చేయడం కార్యక్రమం ఉద్దేశమని కలెక్టర్ అన్నారు. ఉపాధి అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని చెప్పారు. పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.


