సబ్‌ కలెక్టర్‌ను కలిసిన సిటిజన్‌ ఫోరం సభ్యులు | - | Sakshi
Sakshi News home page

సబ్‌ కలెక్టర్‌ను కలిసిన సిటిజన్‌ ఫోరం సభ్యులు

Sep 21 2026 12:26 AM | Updated on Sep 21 2026 12:26 AM

జయపురం: జయపురం సబ్‌కలెక్టర్‌గా ఇటీవల బాధ్యత చేపట్టిన ఐఏఎస్‌ అధికారిణి శుభ్ర పండను స్థానిక సిటిజన్‌ ఫోరం సభ్యులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అక్టోబర్‌ నెలలో జరుగనున్న సీనియర్‌ సిటిజన్స్‌ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొనాలని కోరుతూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. జయపురం సీనియర్‌ సిటిజన్‌ కమిటీ అధ్యక్షురాలు బినోదిని శాంత పాత్రో నేతృత్వంలో కమిటీ సభ్యులు సబ్‌కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కమిటీ కార్యదర్శి జి.వేంకటరెడ్డి, కోశాధికారి రబినారాయణ నందో, సభ్యులు దేవేంద్ర బాహిణీపతి ఉన్నారు.

ఎంఎండీఆర్‌ సవరణపై.. నేడు కాంగ్రెస్‌ నిరసన ర్యాలీ

● హాజరుకానున్న పీసీసీ అధ్యక్షుడు భక్తచరణ్‌ దాస్‌

రాయగడ: ఖనిజ సంపద, రాష్ట్ర ఆదాయ హక్కులు, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ అంశాలపై కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఎం.ఎం.డి.ఆర్‌ సవరణ చట్టం–2026కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ సోమవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ విషయాన్ని కొరాపుట్‌ పార్లమెంటు సభ్యుడు సప్తగిరి శంకర్‌ ఉలక, డీసీసీ అధ్యక్షుడు, రాయగడ ఎంఎల్‌ఏ అప్పల స్వామి కడ్రకలు వెల్లడించారు. ఈ మేరకు స్ధానిక సర్క్యూట్‌ హౌస్‌లొ ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. స్తానిక కపిలాస్‌ కూడలి నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ర్యాలీ ప్రారంభమై తేజస్వీ హొటల్‌ మైదానానికి చేరుకుంటుందన్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు భక్తచరణ్‌ దాస్‌, పీసీసీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, ఎనిమిది మంది శాసన సభ్యులు పాల్గొంటారన్నారు. కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి సుమారు 25 వేల మంది వరకు హాజరు కానున్నట్టు చెప్పారు. విలేకర్ల సమావేశంలో పీసీసీ సాధారణ కార్యదర్శి దుర్గా ప్రసాద్‌ పండ, కొరాపుట్‌ ఎంపీ ప్రతినిధి భూషన్‌ బిడిక పాల్గొన్నారు.

గణపతి లడ్డూ రూ.66,999

పర్లాకిమిడి: స్థానిక మార్కెట్‌ స్క్వేర్‌ వస్త్ర దుకాణాల బజార్‌లో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయక లడ్డూ ప్రసాదాన్ని ఆదివారం వేలం వేశారు. ఈ వేలం పాటలో కోమటివీధిలో అనేక మంది వ్యాపారులు పోటీ పడగా చివరికి పైడిశెట్టి అమృతరావు కుమారులు గిరీష్‌, నితీష్‌ రూ.66,999 దక్కించుకున్నారు. పైడిశెట్టి కుటుంబీకులను వేదికపైకి పిలిచి గజపతి చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ పోట్నూరు రామకృష్ణ , ఫిలిం డిస్ట్రీబ్యూటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వైశ్యరాజు బాలాజీ రాజు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ వీధి గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు జామి పోలిశెట్టి, బోయిన కృష్ణ, కోరాడ హరి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement