విక్రమ్‌ దేవ్‌ విశ్వవిద్యాలయంలో తేజస్‌ | - | Sakshi
Sakshi News home page

విక్రమ్‌ దేవ్‌ విశ్వవిద్యాలయంలో తేజస్‌

Sep 21 2026 12:26 AM | Updated on Sep 21 2026 12:26 AM

జయపురం: కొరాపుట్‌ జిల్లా కోసం జయపురం విక్రమ్‌ దేవ్‌ విశ్వవిద్యాలయంలో ‘తేజస్‌’(ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఎంటర్‌ప్రీనియరల్‌ జోర్నీస్‌ ఎక్రాస్‌ స్టేట్స్‌ డిష్ట్రీక్ట్స్‌) కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌, స్టార్టప్‌ ఇండియ, స్టార్టప్‌ ఒడిశా సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఐఐటీ భువనేశ్వర్‌ రిసెర్చ్‌ అండ్‌ ఎంటర్‌ప్రీనియర్‌షిప్‌ పార్క్‌ విభాగం కోఆర్డినేషన్‌తో విశ్వవిద్యాలయ లెక్చర్స్‌ థియేటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం విద్యార్థులు, యువత, పారిశ్రామిక వేత్తలతో స్టార్టప్‌, వ్యవస్థాపకత గురించి అవగాహన కల్పించటం, స్టార్ట్‌అప్‌ ఎకోసిస్టమ్‌తో పరిచయం చేయటం, వ్యవస్థాపక ప్రయాణానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ సహాయం, అవకాశాల గురించి తెలియజేయడమని ఐఐటీ భువనేశ్వర్‌ రిసెర్చ్‌ అండ్‌ ఎంటర్‌ప్రీనియర్‌షిప్‌ పార్క్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఐఓ)డాక్టర్‌ శోవనకర్‌ పతి వెల్లడించారు. స్టార్ట్‌అప్‌ ఒడిశా సీఈఓ స్మృతిరంజన్‌ ప్రధాన్‌ (ఐఎఎస్‌)స్టార్టఅప్‌ ఒడిశా యొక్క వివిధ కార్యక్రమాలు వ్యవస్థాపక అభివృద్ధిని వివరించారు. జయపురం విక్రమదేవ్‌ విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ హృషికేష్‌ శనాపతి ప్రసంగిస్తూ యువత సాధారణ ఉద్యోగాల కోసం ప్రయత్నించటంతో పాటు, కొత్త ఆలోచనలు ఆవిష్కరణలు ద్వారా సొంత అవకాశాలను సృష్టించుకోవాలని పిలుపు నిచ్చారు. స్థానిక వనరుల ఆధారంతో కొత్త వ్యాపారాలు చేపట్టాలని ఉద్బోధించారు. అందుకు కొరాపుట్‌ జిల్లాలో వనరులు అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement