1075 కిలోల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

1075 కిలోల గంజాయి స్వాధీనం

Sep 21 2026 12:26 AM | Updated on Sep 21 2026 12:26 AM

పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహన బ్లాక్‌ అడవ పీఎస్‌ పరిధిలో గల్లిమెరా వద్ద గత రాత్రి అడవ పోలీసులు పెట్రోలింగ్‌లో 43 గంజాయి (ముచ్చి బ్యాగుల్లో) బస్తాలు అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాయి. వీటిని మోహన తహసీల్దార్‌, ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ రాజేంద్ర కుమార్‌ భుయ్యాన్‌ సమక్షంలో తూనిక వేయగా దాదాపు 1075 కిలోల గంజాయి ఉన్నట్టు నిర్ధారించారు. ఈ పెట్రోలింగ్‌లో గంజా యి తరలించడానికి ఉంచిన నిందితులు ఎవ్వరూ పట్టుబడలేదు. అడవ పోలీసు స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదుచేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌ బిశోయి తెలిపారు. ఈ దాడుల్లో అడవ పోలీసులతో పాటు సబ్‌డివిజనల్‌ పోలీసు అధికారి అమితావ్‌ పండా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement