మధ్యప్రదేశ్‌లో విషాదం | - | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌లో విషాదం

Sep 20 2026 12:27 AM | Updated on Sep 20 2026 12:27 AM

● వాగులో కొట్టుకుపోయిన కారు ● ఏడుగురు ఒడిశా భక్తులు దుర్మరణం

● వాగులో కొట్టుకుపోయిన కారు ● ఏడుగురు ఒడిశా భక్తులు దుర్మరణం

భువనేశ్వర్‌: మధ్యప్రదేశ్‌లో ఒక వాగులో కారు కొట్టుకుపోవడంతో రాష్ట్రానికి చెందిన 7 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. మధ్యప్రదేశ్‌ అగర్‌ మాళ్వా జిల్లా నల్ఖేడాలోని మా బగలాముఖి ఆలయం సమీపంలో ఈ విషాదం చోటు చేసుకుంది. బగ్లాముఖి సందర్శనార్థం ఉజ్జయిన్‌ నుంచి నల్ఖేడాకు వెళ్తుండగా ఆలయం సమీపంలో వర్షపు నీటితో ఉప్పొంగిన వాగులో వారు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. ఆ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు మృతి చెందారు. మృతుల్లో డ్రైవర్‌ మినహా మిగిలిన వారంతా భువనేశ్వర్‌లోని జయదేవ్‌ విహార్‌ ప్రాంతానికి చెందినవారే. మృతులు బనమాలి బెహెరా కుటుంబ సభ్యులు. ఈ ప్రమాదంలో బనమాలి కుమారుడు శివ ప్రసాద్‌ బెహెరా, కుమార్తెలు రాధా రాణి, రీతా రాణి, అల్లుడు జ్ఞానేంద్ర, ఇద్దరు మనుమలు, ఒక మనమరాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో కృష్ణ రాజ్‌వీర్‌ అనే కారు డ్రైవర్‌ కూడా మరణించాడు. ఘటనపై సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి, ప్రతిపక్ష నాయకుడు నవీన్‌ పట్నాయక్‌ ఈ మరణాలపై విచారం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement