ప్రతి రైతుకూ ప్రభుత్వ పథకాలు అందాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి రైతుకూ ప్రభుత్వ పథకాలు అందాలి

Sep 20 2026 12:27 AM | Updated on Sep 20 2026 12:27 AM

మల్కన్‌గిరి: ప్రతి రైతుకూ పక్కాగా ప్రభుత్వ పథకాలు అందాలని కలెక్టర్‌ ప్రథమేశ్‌ అర్వింద్‌ అన్నారు. మల్కన్‌గిరి జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. కలెక్టర్‌ ప్రథమేశ్‌ అర్వింద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రైతులకు డిజిటల్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ వలన విత్తనాలు, ఎరువులు, పంట బీమా, రుణ సదుపాయాలు ఎలాంటి ఆలస్యంగా నేరుగా పొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనిల్‌ ప్రహరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

దసరా వేడుకలపై సన్నాహక సమావేశం

జయపురం: జయపురం రాజ్‌మహల్‌లో వందేళ్ల దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరిపేందుకు రాజమహల్‌ సర్వజననీ పూజా కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు సన్నాహక సమావేశాన్ని శనివారం నిర్వహించారు. సమావేశానికి పట్టణంలోని అన్ని దసరా పూజా కమిటీలను ఆహ్వానించారు. మహారాజుల కాలం నుంచి జయపురంలో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు జరుపుతున్న రాజమహల్‌ సర్వ జననీ పూజా కమిటీ ఈ ఏడాది దసరా పెండాల్‌లు నిర్మించేందుకు కలకత్తా నుంచి పనివారిని రప్పించాలని నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement