ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ సస్పెండ్‌ | - | Sakshi
Sakshi News home page

ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ సస్పెండ్‌

Sep 20 2026 12:27 AM | Updated on Sep 20 2026 12:27 AM

కొరాపుట్‌: మైదల్‌పూర్‌ పారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ సస్పెండ్‌కు గురయ్యారు. శనివారం నబరంగ్‌పూర్‌ జిల్లా డాబుగాం రేంజ్‌ మైదల్‌పూర్‌ సెక్షన్‌ రేంజ్‌ ఆఫీసర్‌ బిఫిన్‌ కుమార్‌ హరిజన్‌ని నబరంగ్‌పూర్‌ పారెస్ట్‌ అధికారి ఉదయ్‌ సుబుద్ది సస్పెండ్‌ చేశారు. దేవబంద్‌ – జమా పొదర్‌ గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణంలో అనుమతి లేకుండా 20 నీలగిరి చెట్లును నరికి ఒక వ్యాపారికి విక్రయించారు. ఈ వ్యవహరం వెలుగులోకి రావడంతో బిఫిన్‌ కుమార్‌ని వివరణ కోరారు. సరైన స్పందన లేకపోవడంతో ఫారెస్ట్‌ అధికారి సస్పెండ్‌ చేస్తూ జిల్లా కార్యాలయానికి అటాచ్‌ చేశారు.

మృతదేహాల తరలింపునకు వాహనం అందజేత

మల్కన్‌గిరి: జిల్లాలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ బ్రహ్మపూర్‌ తరుపున మల్కన్‌గిరిలో కలెక్టర్‌ ప్రథమేశ్‌ అర్వింద్‌ రాజాశిర్కేకు మృతదేహాలు తరలించేందుకు మహా ప్రస్థానం వాహనం అందజేశారు. బ్యాంక్‌ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఈ వాహనాన్ని అందించారు. జిల్లాలోని మారుమూల అంతర్గత ప్రాంతాల నుంచి మృతదేహాలను తరలించే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకే ఈ వాహనాన్ని అందజేశామని బ్యాంక్‌ అధికారి ప్రతాప్‌ కుమార్‌ బైరింగంజాన్‌ అన్నారు. కార్యక్రమంలో మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్‌ మాడ్కమి తదితరులు పాల్గున్నారు.

శ్మశానవాటిక స్థల వివాదం

పర్లాకిమిడి: కాశీనగర్‌ సమితి పరిధిలోని కె.సీతాపురం గ్రామంలో శ్మశానవాటిక స్థలానికి సంబంధించి ఇరువర్గాల మధ్య శనివారం వివాదం చోటుచేసుకుంది. గ్రామంలోని దళిత కుటుంబాలు ఎప్పటినుంచో ఒక నిర్ధిష్ట స్థలంలో అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే గురువారం రాత్రి ఒక వృద్ధురాలు మృతి చెందగా, ఆ స్థలంలో అంత్యక్రియలు చేసేందుకు వేరు కులంవారు ఒప్పుకోలేదు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న కాశీనగర్‌ ఎస్‌ఐ అలోక్‌ జగదాల అక్కడికి చేరుకొని ఇరువర్గాలతో మాట్లాడారు. పోలీసుల సమక్షంలో సయోధ్య కుదరడంతో అంత్యక్రియలు సజావుగా నిర్వహించారు.

మద్యం అమ్మకాలపై

మహిళల ఆగ్రహం

జయపురం: మద్యం, నాటుసారా అమ్మకాలపై మహిళలు ఆగ్రహంతో కదంతొక్కారు. జయపురం సబ్‌ డివిజన్‌ బొరిగుమ్మ సమితి సనపొరియ గ్రామ పంచాయతీ మహిళలు పంచాయతీలో వరదలా పారుతున్న నాటుసారా అమ్మకాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాఠీలు, కర్రలతో రోడ్డెక్కారు. సనపొరియ పంచాయతీ గ్రామాల్లో సారా అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని ర్యాలీ చేపట్టారు. బొరిగుమ్మ తహసీల్దార్‌ కార్యాలయం నుంచి కర్రలు, లాఠీలు చేతబట్టి సారా వ్యతిరేక నినాదాలు చేస్తూ బ్లాక్‌ ఎకై ్సజ్‌ కార్యాలయం వరకు వెళ్లి ఎకై ్సజ్‌ అధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం బొరిగుమ్మ పోలీసుస్టేషన్‌కు వెళ్లి పోలీసు అధికారికి సైతం వినతిపత్రం అందజేశారు. అమ్మకాలు నిలిపివేయకపోతే దుకాణాలు ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి అనామ్‌ దియాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement