క్వారీ పనులు అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

క్వారీ పనులు అడ్డగింత

Sep 20 2026 12:27 AM | Updated on Sep 20 2026 12:27 AM

జయపురం: జయపురం సబ్‌ డివిజన్‌ కుంధ్రా సమితి రాణిగుడ గ్రామ పంచాయతీ శివునిగుడ గ్రామ సమీపంలోని క్వారీ పనులను గ్రామస్తులు శనివారం అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శివునిగుడ పర్వత ప్రాంతంలో ఒక వ్యక్తి లీజుకు తీసుకొని క్వారీ నిర్వహించేవాడు. అయితే ఏ కారణంగానో గత రెండేళ్లుగా క్వారీ నిలిపివేశాడు. మరలా నాలుగు రోజుల క్రితం క్వారీ ప్రారంభమైంది. ఈ విషయం తెలియడంతో వందలాది మంది గ్రామస్తులు క్వారీ వద్దకు వెళ్లి క్వారీ మరలా ఎందుకు నడుపుతున్నారని ప్రశ్నించారు. అయితే లీజుకు తీసుకున్న వ్యక్తి ప్రతినిధులు వచ్చి తమకు 2028 వరకు లీజు గడువు ఉందని తెలిపి గ్రామస్తులతో చర్చించారు. గ్రామంలో ముఖ్య వ్యక్తికి తెలిపి క్వారీ ప్రారంభించామని స్పష్టం చేశారు. అయితే అందుకు గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. ఈ ప్రాంతంలో మొక్కలు నాటి అడవిని సృష్టిస్తామని వారికి తెలిపి క్వారీని నిలిపివేయాలని సూచించారు. ఈ ప్రాంతాన్ని గోచర భూమిగా తమ గ్రామానికి మంజూరు చేయమని కలెక్టర్‌ను కోరగా అందుకు అనుమతి ఇచ్చారని, ఈ ప్రాంతంలో ఈనెల 15వ తేదీ నుంచి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు రాజేంద్ర మఝి, కేశవ భొత్ర, సన నాయిక్‌, భగవాన్‌ నాయిక్‌, గోవర్ధన చలాన్‌, ప్రభు చలాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement