అవినీతి ఆరోపణలపై చర్యలేవీ..? | - | Sakshi
Sakshi News home page

అవినీతి ఆరోపణలపై చర్యలేవీ..?

Sep 20 2026 12:27 AM | Updated on Sep 20 2026 12:27 AM

రాయగడ: రాయగడలోని ఒడిశా స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ (ఓఎస్‌బీసీ) డిపోలో మద్యం లోడింగ్‌కు లంచం డిమాండ్‌ చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు చేపట్టకపోవడం చర్చనీయాంశఽంగా మారింది. ఆరోపణలు వెలుగులోకి వచ్చి సుమారు రెండు వారాలు గడుస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరించడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాయగడ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ సంతోష్‌ కుమార్‌ ధళసామంత్‌కు వివరణ కోరగా, ఈ వ్యవహారంపై శాఖకు చెందిన ఒక జాయింట్‌ డైరక్టర్‌ దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం కూడా ఈ వ్యవహారంపై దర్యాప్తు లేదా చర్యలు చేపట్టలేదని సమాచారం.

ఇదీ విషయం..

ఈనెల 4వ తేదీన రాయగడ ఓఎస్‌బీసీ డిపోలో మద్యం లోడింగ్‌కు అనుమతి ఇవ్వాలంటే లంచం చెల్లించాల్సి వస్తోందని వాహన యజమాని ప్రశాంత్‌ నాయక్‌ ఆరోపించారు. గతంలో ఒకొక్క వాహనానికి రూ.10 వేలు చెల్లించేవారమని, ప్రస్తుతం ఆ మొత్తం రూ.20 వేలకు పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లంచం ఇవ్వడానికి నిరాకరిస్తే లోడింగ్‌కు అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. బ్రాంచ్‌ మేనేజర్‌ ఉదయ్‌లాల్‌ నాయక్‌ నేరుగా డబ్బులు తీసుకోకుండా ఓఎస్‌బీసీ అకౌంటెంట్‌ అజయ్‌ నాయక్‌ ఫోన్‌పే ఖాతా ద్వారా డబ్బులు తీసుకుంటున్నారని ప్రశాంత్‌ నాయక్‌ ఆరోపించారు. డబ్బులు చెల్లించకపొతే మద్యం దుకాణం యజమానులకు ఫోన్‌చేసి ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా సంబంధిత అధికారులు కావాలనే వాహనాలను రోజుల తరబడి ఓఎస్‌బీసీ వద్ద వేచి ఉండేలా చేస్తున్నారని పేర్కొన్నారు. లంచం చెల్లింపులకు సంబంధించిన డిజిటల్‌ లావాదేవీల ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని వాహన యజమాని పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఆరోపణలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement