కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా 24వ ప్రణాళిక సంఘ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా జరిగింది. ప్రణాళిక సంఘం అధ్యక్షుడు, నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి అధ్యక్షతన మిషన్ శక్తి సమావేశ మందిరంలో జరిగింది. దీనిలో భాగంగా కేబీకే అభివృద్ధి పథకం, తాగునీరు, విద్యుత్, రోడ్ల నిర్మాణం కోసం ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. వస్త్ర విభాగ డైరక్టర్ కార్యాలయం ప్రారంభించాలని, బైపాస్ రోడ్డు నిర్మాణం, వైద్య కళాశాల నిర్మాణం, తదితర అంశాలపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సభ్యులు ప్రతిపాదన చేశారు. సమావేశంలో జిల్లా మంత్రి నిత్యానంద గొండో, కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, జెడ్పీ ప్రెసిడెంట్ మెతిరాం నాయక్, ఎమ్మెల్యే మనోహర్ రఽంధారి, నర్సింగ్ బోత్ర తదితరులు పాల్గొన్నారు.


