మల్కన్‌గిరి: జిల్లాలోని ఖోయిర్‌పూట్ సమితి ప్రభు త్వ పాఠశాలలో జిల్లాస్థాయి పాఠశాలల సమూహ క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజాన్ పాణిగ్రాహి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మల్కన్‌గిరి ఎమ్మె ల్యే నర్సంగ్ మడ్కామి, చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా లోని ఏడు సమితులకు చెందిన 451 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఖో–ఖో, చెస్, ఆర్చరీ, కబడ్డీ, హ్యాండ్‌బాల్ తదితర క్రీడాంశాల్లో పోటీలు జరుగుతున్నాయి. అనంతరం జాతీయ మారథాన్ క్రీడాకారుడు బుద్రా బిశినాయక్, మల్కన్‌గిరికి చెందిన రగ్బీ క్రీడాకారుడు గణేష్ ధాంగడా మాఝిని సత్కరించారు. కార్యక్రమంలో ఖోయిర్‌పూట్ పంచాయతీ సమితి అధ్యక్షుడు శ్రీవిష్ణు కిర్సానీ, స్థానిక సర్పంచ్ దైమతి గోల్పెడా తదితరులు పాల్గొన్నారు.


