కొరాపుట్: మితిమీరిన వేగంతో వచ్చిన బొలేరో వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి చంపి గ్రామ పంచాయతీ తిమెజోల గ్రామానికి చెందిన మజ్జి హిక్కాక (35) ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. అతను తోయాపుట్ గ్రామం వద్దకు వచ్చేసరికి అతివేగంగా వచ్చిన బొలేరో వాహ నం వెనుకనుంచి ఢీకొంది. దీంతో హిక్కాక దూరంగా ఎగిరిపడి తీవ్రగాయాలు పాలవ్వడంతో మృతి చెందాడు. ఘటనకు కారణమైన బొలేరో డ్రైవర్ పరారయ్యాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు లక్ష్మీపూర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకి దిగారు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారికి ఆర్థిక సాయం చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు.


