మీడియా ముసుగులో అతి సరికాదు | - | Sakshi
Sakshi News home page

మీడియా ముసుగులో అతి సరికాదు

Sep 20 2026 12:27 AM | Updated on Sep 20 2026 12:27 AM

కొరాపుట్‌: పాత్రికేయులు మీడియా ముసుగులో అతి చేయడం సరికాదని జయపూర్‌ ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహిణీపతి హితవు పలికారు. శుక్రవారం కొరాపుట్‌ జిల్లా కేంద్రంలో జరిగిన దిశ సమావేశం వద్ద జరిగిన వివాదంపై శనివారం వివరణ ఇచ్చారు. దిశ మీటింగ్‌ వద్ద పాత్రికేయ దంపతులు మీడియా స్వేచ్ఛ పేరిట తనతో దురుసుగా వ్యవహరించారన్నారు. తాను ఇప్పటివరకు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపొందినా రాష్ట్రవ్యాప్తంగా పాత్రికేయులతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. కానీ దిశ మీటింగ్‌ వద్ద ఒక పాత్రికేయ దంపతులు తన వద్ద బైట్‌ తీసుకొని కూడా అసందర్భ ప్రశ్నలు వేశారని తెలిపారు. అంతేకాకుండా బైట్‌ తీసుకున్న తర్వాత కూడా తనను అడ్డగించడం మీడియా మిత్రుల సమక్షంలో జరిగిందన్నారు. ఈ విషయంపై తాను సదరు మీడియా యజమాన్యానికి ఫిర్యాదు చేస్తానని చెప్పినా తనతో వాదనకి దిగారన్నారు. జిల్లా కలెక్టర్‌ కూడా ఆ సమయంలో ఉన్నారని, అంతేకాకుండా ఇతర అధికారులు కూడా చూశారన్నారు. మీడియా చేతిలో ఉందని చెబుతూ బెదిరించడం, తగవులు పెట్టుకోవడం సరికాదన్నారు. సదరు మీడియా దంపతుల వైఖరిని అందరూ పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement