కొరాపుట్: అక్రమ మద్య విక్రయాలను అడ్డుకోవడానికి ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత అక్రమ మద్యం విక్రయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్కిరిగుమ్మ సమీపంలోని గౌడగుడ గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్న ఇద్దరు వ్యాపారులను స్థానిక యువకులు అడ్డుకున్నారు. అడ్డుకున్న యువకులపై వ్యాపారులు దాడి చేశారు. ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక యువకులతో కలిసి మద్యం వ్యాపారులను స్థానిక పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. వెంటనే పోలీసులు వారిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.


