భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు | - | Sakshi
Sakshi News home page

భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు

Sep 18 2026 12:51 AM | Updated on Sep 18 2026 12:51 AM

రాయగడ: భార్యను గొడ్డలితో దాడిచేసి హత్య చేసిన కేసులో భర్త గురునాథ్‌ గౌడోకు రాయగడ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. కేసులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అల్పనా స్వయ్‌ ఈ మేరకు తీర్పును వెలువరించారు. జీవిత ఖైదుతో పాటు రూ.20 వేల జరిమనా చెల్లించాలని, చెల్లించలేని పక్షంలో అదనంగా మరో ఆరు నెలల పాటు కఠిన కారాగార శిక్షను అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2024లో జిల్లాలోని కాసీపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన ఈ కేసు విచారణ కొనసాగుతుంది. గురునాథ్‌ గౌడో తన భార్య పుష్పాగౌడోపై గొడ్డలితో దాడిచేసి హత్య చేసినట్లు ప్రాసిక్యూషన్‌ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి విచారణలోకి రావడంతో న్యాయమూర్తి అల్పనా స్వయ్‌ 14 మంది సాక్షుల వాగ్మూలాలను నమోదు చేసుకున్న అనంతరం ఈ తీర్పును వెలువరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement