దీపారాధన
పర్లాకిమిడి: స్థానిక పెద్ద రాధాకాంత మఠంలో జిల్లా అధికారులు అశీర్వాద్ దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం ఏడీఎం మునీంద్ర హనగ, జిల్లా పరిషత్ సీడీఓ దయామయా పాడీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సేవా సంకల్స్ అభియాన్ ఆధ్వర్యంలో ఈ ఆశార్వార్ దీప ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ వెల్ఫ్‌ర్ ప్రొటెక్షన్ అధికారి సరలా పాత్రో, సబ్ కలెక్టర్ భగత్ సామల్ కల్యాణ్ రావ్, జిల్లా కల్చరల్ అధికారి అర్చనా మంగరాజ్, మిషన్ శక్తి డీపీఎం, డి.ఎల్.ఎఫ్ మహిళా స్వయం సహాయక గ్రూపు మహిళలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని గుజరాతీపేట సమీప నాగావళి వంతెన వద్ద బుధవారం అర్ధరాత్రి ఓ వ్యక్తిని ద్విచక్రవాహనంతో ఢీకొట్టి పరారైన నిందితుడిని సీసీ ఫుటేజీ ద్వారా ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ సీఐ వి.రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. గుడివీధికి చెందిన గుంటుకు స్వామిబాబు హయాతినగరం నుంచి ఏడురోడ్ల కూడలి వైపు వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఫరీద్‌పేట ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద నివాసముంటున్న సావడ గౌరీశంకర్ పాతబ్రిడ్జి వద్ద మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనంపై ఎదురుగా వస్తూ బలంగా ఢీకొట్టాడు. రోడ్డుపై పడిపోయిన స్వామిబాబు కుడికాలు నుజ్జయ్యింది. కాస్త ముందుకెళ్లి ఆగిన గౌరీశంకర్ స్థానికులు గూమిగూడటంతో భయపడి వెళ్లిపోయాడు. గుజరాతీపేట కూడలిలో ఉన్న సీసీ ఫుటేజీలో ప్రమాద దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. క్షతగాత్రుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, నిందితున్ని స్టేషన్‌కు పిలిపించామని, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని సీఐ రామారావు వెల్లడించారు. ఏఎస్‌ఐ సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


